తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో ఎనలేని ఖ్యాతిని సొంతం చేసుకున్నారు నందమూరి తారకరామారావు. నట సార్వభౌముడిగా ఇప్పటికీ కూడా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్పాలి. ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతూ ఎన్నో ఏళ్ల పాటు హవా నడిపించారు. అప్పట్లో ఎన్టీఆర్ సినిమాలో ఒక్కసారి ఛాన్స్ వస్తే చాలు అని ఎంతో మంది హీరోయిన్లు కోరుకునేవారు అని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు.


 అంతేకాదు తాను నటించబోయే సినిమాలో హీరోయిన్గా ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై దర్శక నిర్మాతలు కాదు స్వయంగా ఎన్టీఆర్ నిర్ణయం తీసుకునేవారు అని చెప్పాలి. ఇకపోతే ఎన్టీఆర్ షూటింగ్ విషయంలో పక్క టైం పాటించేవారు. ఎవరైనా ఆలస్యంగా వచ్చినా కూడా అలా రావద్దు అంటూ సూచించేవారు. అలాంటి ఎన్టీఆర్ ఒక హీరోయిన్ గురించి మాత్రం గంటల తరబడి వేచి చూసారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు జయలలిత. ఎన్టీఆర్ జయలలిత కాంబినేషన్లో గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ లో కథానాయకుడు సినిమా వచ్చింది.


 రాజకీయ నేపద్యం ఉండే ఈ సినిమాలో నీతి నిజాయితీ కలిగిన యువకుడిగా ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఎన్టీఆర్ ని అభిమానించి ప్రేమించే యువతీగా జయలలిత నటిస్తోంది. ఇక ఈ సినిమాలోని రెండు పాటలను కూడా అప్పట్లో కలర్ లో తీశారు. కానీ జయలలిత మీద షూటింగ్ చేసే ఒక పాటలో కొంత వర్క్ మిగిలిపోయింది. కాగా ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయాలని భావించింది చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 3న పాటలోని మిగతా వర్క్ పూర్తి చేయాలి. ఇలాంటి సమయంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి అన్నదురై మరణించారు. ఆయన మరణంతో షూటింగ్లన్నీ బంద్ అయిపోయాయి. అప్పుడు మిగిలి ఉన్న వర్క్ జరపడం కష్టంగా మారింది .

ఇక అప్పుడు కంప్లీట్ చేయకపోతే ఎన్టీఆర్ డేట్స్ ఆరు నెలల వరకు ఖాళీ లేవు.  జయలలిత కూడా అన్నదురై అంత్యక్రియలకు తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోని అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత జయలలిత షూటింగ్లో పాల్గొన్నారు. ఇక అప్పటికే ఎన్టీఆర్ వేసుకొని రెడీగా ఉన్నారు. గంటలు గంటలు లేట్ అవుతుండడంతో తరచూ నిర్మాతకు ఫోన్ చేస్తూ ఉన్నాడు. చివరికి జయలలిత వచ్చారు. అయినప్పటికీ అసహనం వ్యక్తం చేయకుండా ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొన్నారు. ఇక అనుకున్న ప్రకారమే సినిమా ఫిబ్రవరి 27న విడుదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: