అక్కినేని నాగార్జున వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇదే ఊపులో ఇప్పుడు అయన మరో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇప్పటికే వచ్చిన అప్డేట్ లతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది ది ఘోస్ట్. ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న రిలీజ్ కానుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదల కాబోతున్నఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ తప్పకుండా అన్దిర్ని అలరిస్తుందని చెప్తున్నారు. ఈ సినిమాకు ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయన గతంలో కొన్ని మంచి సినిమాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ కోవలోనే ఈ సినిమా ను కూడా చేశాడని అంటున్నారు.

ఇప్పటికే వచ్చిన అప్డేట్ లలో ఇది స్పష్టంగా తెలిసిపోయింది. మేకింగ్ హైలైట్ గా ఈ సినిమా నిలువబోతుంది. అలా ఈ సినిమా పై ఇన్ని అంచనాలు ఏర్పడడానికి కారణం డైరెక్టర్ అనే చెప్పాలి. హీరోయిన్ గా ఈ సినిమా లో సోనాల్ చౌహాన్ కనిపిస్తుండగా ఆమె కూడా తన గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటోంది. భ‌ర‌త్‌, సౌర‌భ్ సంగీతాన్ని అందించారు. మరి మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా కు పోటీగా రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా కోసం అందరు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారట. ఇందులోని ఓ కీల‌క‌మైన యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం సోనాల్ చౌహాన్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న‌ద‌ట‌.

సినిమా కోసం ఈ విధంగా చేసే నటీనటులు చాలా తక్కువ ఉంటారని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం ఆమె చేసిన రిస్క్ అంతా ఇంతా కాదు.  ఈ శిక్ష‌ణ‌లో ఆమె పాదం ఫ్రాక్చర్ కావడంతో చిత్ర యూనిట్ సోనాల్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లినట్లు తెలిసింది. ట్రైనింగ్ ఆపేయ‌డ‌మే కాకుండా ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు ఆమెకు సూచించినట్లు తెలిసింది. కానీ గాయాన్ని లెక్కచేయకుండా సోనాల్ ట్రైనింగ్ పూర్తిచేయడమే కాకుండా యాక్ష‌న్ సీక్వెన్స్ షూటింగ్ లో పాల్గొని సినిమా ఇంత త్వరగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సాయం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: