సిద్దు జొన్నలగడ్డ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం డీజే టిల్లు. ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుందో మనకు బాగా తెలిసిందే. ఇక ఈ ఏడాది మొదట్లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని మేకర్స్ ప్లాన్ చేశారు.ఇకపోతే మొదటి భాగంలో నేహా శెట్టి రాధిక పాత్రలో నటించే ప్రేక్షకులను బాగా సందడి చేశారు.


అయితే తప్పనిసరి పరిస్థితులలో సీక్వెల్ చిత్రంలో హీరోయిన్ నేహా శెట్టి స్థానంలో నటి శ్రీ లీలను ఎంపిక చేశారు.


ఇక ఈ సినిమాలో రెండు రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నటువంటి శ్రీ లీల ఉన్నఫలంగా ఈ సినిమా నుంచి తప్పకున్నట్లు వార్తలు వచ్చాయి.ఈ విధంగా శ్రీ లీల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో మేకర్స్ వెంటనే ఈ సినిమాలో నటించే అవకాశాన్ని నటి అనుపమ పరమేశ్వరన్ కు కల్పించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో బాగా బిజీగా ఉన్నారు. ఇకపోతే శ్రీ లీల ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని కూడా నిర్మాత నాగ వంశీ వెల్లడించారు.


 


ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ శ్రీ లీల ప్రస్తుతం వరుస ప్రాజెక్టుల తో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె రవితేజ నటించిన ధమాకా సినిమా తో బిజీగా ఉన్నారు. అలాగే అనగనగా ఒక రాజా, అదేవిధంగా బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమాలో కూడా నటిస్తున్నారు. డీజే టిల్లు సినిమాని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ని ఈమె మరో మూడు సినిమాల లో నటిస్తున్నారు.


 


ఈ విధంగా వరుస ప్రాజెక్టుల తో ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీ లీల డేట్స్ మొత్తం క్లాష్ కావడంతో డిజె టిల్లు సినిమా నుంచి తప్పనిసరి పరిస్థితులలో తప్పుకోవాల్సి వచ్చింది.ఇలా శ్రీ లీల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో యూత్ లో ఎంతో మంచి క్రేజ్ ఉన్నటువంటి అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా కి ఎంపిక చేశారు. ఇదివరకే కార్తికేయ 2సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంతగా నో ఆకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్ డిజె టిల్లు సినిమా సీక్వెల్ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: