టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే తాజాగా నాగార్జున "బ్రహ్మాస్త్ర" అనే హిందీ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం నటించిన రెండు మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నాగార్జున తాజాగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ లో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 5 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.

నైజాం : 5.50 కోట్లు .
సీడెడ్ : 2.50 కోట్లు .
ఆంధ్ర :  8 కోట్లు .
రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ది ఘోస్ట్ మూవీ 16.00 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.
కర్ణాటక :  65 లక్షలు .
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  2 కోట్లు .
ఓవర్ సీస్ లో :  2.5 కోట్లు .
ది ఘోస్ట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 21.15 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ది గోస్ట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 22 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: