టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే  ఈ మూవీ లో సోనాల్ చౌహన్ నాగార్జున సరసన హీరోయిన్ గా నటించగా ,  టాలీవుడ్ యంగ్ దర్శకులలో ఒకరు అయినటు వంటి ప్రవీణ్ సత్తార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నిన్న అనగా అక్టోబర్ 5 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో టాక్ లభించింది. అలాగే ఈ మూవీ లో యాక్షన్ సన్నివేశాలు అదిరి పోయే రేంజ్ లో ఉన్నట్లు కూడా టాక్ బయటకు వచ్చింది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్ లు దక్కాయి. ది ఘోస్ట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 57 లక్షలు .
సీడెడ్ : 25 లక్షలు .
యు ఏ : 31 లక్షలు .
ఈస్ట్ : 23 లక్షలు .
వెస్ట్ : 8 లక్షలు .
గుంటూర్ : 22 లక్షలు .
కృష్ణ : 19 లక్షలు .
నెల్లూర్ : 15 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో ది ఘోస్ట్ మూవీ మొదటి రోజు 2.00 కోట్ల షేర్ , 3.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  20 లక్షలు .
ఓవర్ సీస్ లో : 25 లక్షలు .
ప్రపంచ వ్యాప్తంగా ది ఘోస్ట్ మూవీ మొదటి రోజు 2.45 కోట్ల షేర్ , 4.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మరి ది ఘోస్ట్ మూవీ రాబోయే రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: