టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కింగ్ నాగార్జున ఇప్పటికే ఈ సంవత్సరం బంగార్రాజు , బ్రహ్మాస్త్ర మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అక్టోబర్ 5 వ తేదీన దసరా పండుగ సందర్భంగా నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే  ఈ మూవీ లో నాగార్జున సరసన మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించగా , టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం కూడా ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు ప్రవీణ్ సత్తా తెరకెక్కించిన విధానం , ఆ యాక్షన్ సన్నివేశాలలో నాగార్జున నటన అద్భుతంగా ఉన్నట్లు విమర్శకులు ప్రశంసలను కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ది ఘోస్ట్ మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" సంస్థ దక్కించుకున్నట్లు కొన్ని వారాల ధియేటర్ రన్ తర్వాత ఈ మూవీ ని నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: