టాప్ హీరోల సినిమాలకు ఏవరేజ్ టాక్ వచ్చినప్పటికీ వీకెండ్ ముగిసేసరికి పెద్ద హీరోల సినిమాలకు 50 కోట్ల కలక్షన్స్ రావడం చాల సులువుగా ఉండేది. గతంలో ఇండస్ట్రీకి ఉన్న ఈ అనుభవాల రీత్యా ఈసారి దసరా ను నమ్ముకుని విడుదలైన మూడు సినిమాల పరిస్థితిని చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


దసరా కు వచ్చిన సినిమాలలో టాక్ రీత్యా మొదటి స్థానంలో నిలిచిన ‘గాడ్ ఫాదర్’ పరిస్థితిని చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఈసినిమాకు టోటల్ పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈసినిమాకు వచ్చిన కలక్షన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ విశ్లేషకులకు షాక్ ఇస్తున్నాయి. ఈసినిమా మొదటి రెండు రోజులకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేవలం 13 కోట్ల షేర్ వచ్చింది అని వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.


దసరా సినిమాలలో రెండవ స్థానంలో నిలిచిన బెల్లంకొండ గణేష్ ‘స్వాతిముత్యం’ మూవీకి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా ఈమూవీని సినిమా విశ్లేషకులు కూడ ఆకాశానికి ఎత్తేసారు. అయినప్పటికీ ఈసినిమా వైపు ప్రేక్షకులు చూడటంలేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇక నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. ఈమూవీని అక్కినేని ఫ్యాన్స్ కూడ పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించడంలేదు.


దీనితో దసరా పండుగకు సినిమాలు చూడకుండా జనం ఏమిచేసారు అని విశ్లేషణ చేసుకుంటే తెలుగు రాష్ట్రాలలోని జనం ఎక్కువగా ఆలయాలలోను అదేవిధంగా భారీగా దసరా ఆఫర్లు ప్రకటించిన టివి ఫ్రిజ్ షోరూములలోను పండుగ పూట ఎక్కువసేపు కాలం గడిపి తమకు నచ్చిన వస్తువులు కొనడంలో బిజీగా ఉండటంతో దసరా సినిమాను అంతగా పట్టించుకోలేదు అంటున్నారు. చాలామంది మధ్య తరగతి ప్రజలు  50వేల రూపాయలకి దొరుకుతున్న 55 ఇంచెస్ టివిని EMI పద్దతిలో కొనుక్కుని ఎంజాయ్ చేస్తే దిగువ తరగతి వర్గాలు రికార్డు స్థాయిలో మద్యం సేవించి బిజీగా ఉండటంతో దసరా సినిమాలను ఎవరు పట్టించుకోలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: