దసరా టాప్ హీరోల సినిమాల రేస్ లో చిరంజీవి విజేతగా మారితే ఎవరు ఊహించని విధంగా ‘స్వాతిముత్యం’ రెండవ స్థానంలో నిలిచి ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగార్జున ను మూడవ స్థానానికే పరిమితం చేసింది. దసరా రేస్ ముగిసి పోవడంతో ఇక ఇండస్ట్రీ దృష్టి దీపావళి పై పడింది. తెలుగు సినిమాలకు సంబంధించి అమావాస్య సెంటిమెంట్ తో పెద్ద హీరోల సినిమాలు విడుదల కావు.



అయితే ఇలాంటి సెంటిమెంట్ టాలీవుడ్ చిన్న హీరోలకు ఉండదు కాబట్టి వారి సినిమాలతో పాటు భారీ బాలీవుడ్ సినిమాలు భారీ తమిళ సినిమాలు దీపావళి కి విడుదల కావడం ఒక పరిపాటి. ఇక తెలుగుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా వరస అపజయాలు చూస్తున్న మంచు విష్ణు ‘జిన్నా’ దీపావళికి రాబోతోంది. ఈ మూవీకి పోటీగా విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ మూవీ విడుదల కాబోతోంది.



అదేవిధంగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింప బడ్డ ‘అన్నీ మంచి శకునములే’ తో పాటు దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్ నటించిన మొదటి సినిమా ‘అహింస’ కూడ ఈ దీపావళి కి రాబోతోంది. ఈసినిమాలతో పాటు భారీ అంచనాలతో విడుదల కాబోతున్న అక్షయ్ కుమార్ ‘రామసేతు’ దీపాళికి రానున్నది.



ఇక ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో రానున్న ‘ప్రిన్స్’ తో పాటు కొన్ని కన్నడ డబ్బింగ్ సినిమాలు కూడ దీపావళి కే వస్తున్నాయి. ఇన్ని చిన్న సినిమాల యుద్దంలో ఒకటి రెండు సినిమాలు మినహా మిగతా అన్ని సినిమాలను ప్రేక్షకుల దృష్టికి రావు. దీనికి తోడు అభిరామ్ నటించిన మొదటి సినిమా ‘అహింస’ మూవీని చాల భారీ స్థాయిలో ప్రమోట్ చేయబోతున్నారు. దర్శకుడు తేజా ఈసినిమాను చాల పట్టుదలగా తీసాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇన్ని చిన్న సినిమాల మధ్య ఏసినిమా దీపావళి లో విజేతగా నిలుస్తుంది అన్న విషయమై ఇండస్ట్రీలో ఆశక్తి నెలకొని ఉంది..  




మరింత సమాచారం తెలుసుకోండి: