ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. 16 ఏళ్ల వయసులో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ రావడంతోనే తన నటన అందంతో అందరినీ ఫిదా చేసింది.
తన అందంతో కుర్రకారును ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకుంది. ఉప్పెన సినిమా తర్వాత వరుసగా నాని హీరోగా వచ్చిన శ్యాం సింగరాయ్ , అలాగే అక్కినేని నాగ చైతన్య, నాగార్జున హీరోలుగా వచ్చిన బంగార్రాజు సినిమా లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. అంతేకాదు ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వడంతో కృతి శెట్టి ని గోల్డెన్ లెగ్ అని పిలిచారు . ఇక ఆ తర్వాత రామ్ పోతినేని కి జంటగా వచ్చిన ది వారియర్, అలాగే నితిన్ సరసన హీరోయిన్ గా చేసిన మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబు సరసన వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

ఈ విషయం పక్కన పెడితే ఈమె మొదటి సినిమాకి 20 లక్షల పారితోషికాన్ని అందుకొని ఆ తర్వాత దాదాపు ఒక కోటి వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కృతి శెట్టి కి యూత్ లో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండడంవల్ల ఈమెకు రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇవ్వడానికి కూడా చాలా మంది దర్శక నిర్మాతలు ముందడుగు వేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే కృతి శెట్టి గురించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. కృతి శెట్టి కారణంగా తెలుగులో స్టార్ కమెడియన్ అయిన వెన్నెల కిషోర్ కి ఓ స్టార్ హీరో నుండి వార్నింగ్ వచ్చిందట. అదేంటంటే వెన్నెల కిషోర్ కృతి శెట్టి మీద కుళ్ళు జోకులు వేస్తుంటే కృతి శెట్టి కి అర్థం కాలేదట. కానీ నాగార్జున మాత్రం నా కోడలిపై ఇంకోసారి జోక్స్ వేసినా, ఆమెతో మాట్లాడిన బాగుండదు అంటూ వెన్నెల కిషోర్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. అయితే నాగార్జున, నాగచైతన్య, కృతి శెట్టి లు కలిసి బంగార్రాజు సినిమాల్లో నటించారు.

సినిమా షూటింగ్ టైంలో వెన్నెల కిషోర్ సరదాగా కృత్తిశెట్టి పై జోకులు వేయడంతో ఆమె వాటిని ఫన్నీగా తీసుకోలేక పోయిందట. దాంతో విషయం గ్రహించిన నాగార్జున వెన్నెల కిషోర్ కి వార్నింగ్ ఇచ్చాడట. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది నెటిజెన్స్ కృతి శెట్టి నాగార్జున కోడలు అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అంతేకాదు బంగార్రాజు సినిమా రిలీజయ్యాక కృతి శెట్టి నాగచైతన్య రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని థంబ్ నెయిల్స్ వేసి యూట్యూబ్ లో చాలా వీడియోలు వచ్చాయి. కానీ ఈ విషయంపై గతంలో నాగచైతన్య స్పందించి మా మధ్య ప్రేమ గీమా లాంటివి ఏమీ లేవు అంటూ కొట్టిపారేశారు. ఇక ఇప్పుడు కృతి శెట్టి నాగార్జున కోడలు అంటూ వస్తున్న వార్తలపై నాగార్జున ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: