రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఆస్తుల విలువ తెలుసా?. మీ ఊహకు కూడా అందదు!
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ గా రామ్ చరణ్ - ఉపాసన ఉన్నారు. కేవలం స్టార్ హీరో వైఫ్ గానే కాకుండా ఉపాసన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కలిగి ఉన్నారు.
ఆమె మహిళా వ్యాపారవేత్త, సోషల్ ఆక్టివిస్ట్. అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్. అలాగే ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ టిపిఏ లిమిటెడ్ డైరెక్టర్ కూడాను. బి పాజిటివ్ పేరుతో ఓ ఫిట్నెస్, లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కూడా నడుపుతున్నారు. ఉపాసన అనేక నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కి ప్రాతినిధ్యం వహించారు. ఇక ఉపాసన పేరిట ఉన్న ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. టాలీవుడ్ హీరోల భార్యలలో ఉపాసన అందరి కంటే చాలా రిచ్.
ఉపాసన దోమకొండ సంస్థానం వారసురాలు.కామినేని ప్రతాప్ రెడ్డి మనవరాలు, అనిల్ కుమార్ కూతురు. అపోలో గ్రూప్ వాటాదారు కూడాను. ఒక అంచనా ప్రకారం ఉపాసన వాటా విలువ 8 నుండి 10 వేల కోట్ల రూపాయలు ఉంటుందట. ఇక స్థిర, చర ఆస్తుల రూపంలో వందల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల ఆస్తులు మొత్తం కలిపినా ఉపాసనకు ఉన్న సంపదకు సమానం కాదు.అంత సంపద ఉన్నా ఉపాసన చాలా నిరాడంబరంగా ఉంటారు. రిలేషన్స్ కి బాగా విలువ ఇస్తారు. అత్తమామలు చిరంజీవి, సురేఖ అంటే అమితమైన గౌరవం కనబరుస్తారు. మెగా అభిమానులు ఆమె ప్రవర్తనను చాలా ఇష్టపడతారు. వదినమ్మ అని పిలుచుకుంటారు. అదే సమయంలో ఉపాసన మెగా వారసుడికి జన్మనివ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఈమేరకు రామ్ చరణ్ కి సోషల్ మీడియా వేదికగా తమ ఆకాంక్ష తెలియజేస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలలో కూడా ఉపాసనకు ఈ ప్రశ్న ఎదురవుతుంది.పెళ్ళై పదేళ్లు కావస్తున్నా ఎందుకు పిల్లలు కనలేదని ఆమెను అడుగుతున్నారు. జీవితంలో పిల్లలు కనడం కంటే ముఖ్యమైన విషయాలు అనేకం ఉన్నాయి. ఇంత కంటే నేను ఏమి మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తారని ఉపాసన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2012 జూన్ 14న ఉపాసన-రామ్ చరణ్ వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఈ ఏడాది 10వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. దీనికోసం విదేశాలకు చెక్కేశారు. అదే సమయంలో ప్రొఫెషనల్ గా ఇద్దరూ చాలా బిజీ. ఇటీవల సిస్టర్స్ తో రామ్ చరణ్ టూర్ వెళ్ళాడు. బిజీ షెడ్యూల్స్ కారణంగా ఉపాసన ఆ ట్రిప్ మిస్ అయ్యారు. దానికి ఆమె ఫీల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: