ఆచార్యతో అంత అయిపోయింది. ఇక రిటైర్మెంట్ బెటర్ ఏమో.. గాడ్ ఫాదర్ తో చిరు కెరీర్ క్లోజ్.. చిరంజీవి సినిమా అంటే భయపడుతున్న బయ్యర్లు.. ఇలా ఒక్కటేంటీ ఎన్నెన్నో విమర్శలు.
గాడ్ ఫాదర్ రిలీజ్ కి ముందు మీడియాలో చిరంజీవి సినీ ప్రస్థానంపై నెగిటీవ్ వార్తలు అన్నీఇన్నీ కావు. ఒకా నొక స్టేజిలో చిరంజీవే మీడియాలోని నె గిటీవ్ ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేసాడు కూడా. అయితే ఈ కారుకూతలన్నింటికీ మెగా రికార్డ్స్ తో సమాధానం ఇచ్చే శాడు చిరంజీవి. చిరు డ్రీమ్ ప్రాజెక్టు సైరా నిరాశ పరచటం, ఆచార్య డిజాస్టర్ అవ్వటం తో వచ్చిన విమర్శల కు గాడ్ ఫాదర్ తో బ్లాక్ బస్టర్ కొట్టి బాస్ ఈజ్ బ్యాక్ అనిపించాడు చిరంజీవి. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన 'గాడ్ ఫాదర్'.. తొలిరోజే సూ పర్ హిట్ టాక్ దక్కించుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.38 కోట్ల గ్రాస్ ‌ను వసూలు చేయగా మూడు రోజుల్లో రూ.60 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే టాక్ కంటే కలెక్షన్స్ కాస్త నెమ్మదిగా ఉండటంతో మళ్ళీ విమర్శలు వచ్చాయి. దాంతో అలెర్ట్ అయిన చిరంజీవి గేర్ మార్చి వరుస ఈవెం ట్స్ తో ప్రమోష న్స్ ని పీక్స్ కి తీసుకెళ్లాడు. దాంతో వీకెండ్ ఆది వారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 40కోట్లకి పైగా కలెక్ట్ చేసి నాలుగు రోజుల్లో రూ.100 కోట్లకు చేరిం ది గాడ్ ఫాదర్. మెగాస్టార్ మూవీ.. ఇవాళ ఐదో రోజు రూ.100 కోట్ల మార్కును కూడా దాటేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అధికారికంగా పోస్ట ర్ విడుద ల చేసింది. అంటే, విడు దలైన ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూలుచేసిన 'గాడ్ ఫాదర్'.. బ్లాక్ బస్టర్ దిశగా దూసు కుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: