ఈ రోజుల్లో ఒక సినిమా ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత రాబట్టాయి అనే విషయం తెలుసుకోవడం చాలా కష్టంగా మారిపోయిందని చెప్పవచ్చు.ముఖ్యంగా సోషల్ మీడియాలో బాక్సాఫీస్ వెబ్సైట్లో కూడా ఎవరికి నచ్చిన విధంగా వారు నెంబర్లను మార్చుకుంటూ ఉన్నారు. ఒక పెద్ద సినిమా సంబంధించి కలెక్షన్ల గురించి ఆ సినిమా పంపిణీ చేసిన నిర్మాత దిల్ రాజును అడగగా డిస్ట్రిబ్యూటర్లు తాను ఒక ఫిగర్ ఇస్తే నిర్మాతలు వాళ్లకు నచ్చినట్లుగా కలెక్షన్లను రాసుకుంటూ ఉంటారని చెప్పారని తెలియజేశారు. ఇలా టాలీవుడ్ లో ఎన్నో ఫేక్ వసూలు వ్యవహారం చాలా నడుస్తుందని చెప్పవచ్చు.


అయితే ఇలా చేయడానికి ముఖ్య కారణం వారు తెరకెక్కించే కొత్త సినిమాలకు హైప్ తేవడానికి అన్నట్లుగా సమాచారం. కానీ ఎప్పుడూ విడుదలైన పాత సినిమాలను కలెక్షన్ల విషయంలో కూడా ఫేక్ చేస్తున్నారని ఆరోపణలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆగస్టులో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి చిత్రాన్ని స్పెషల్ షోలు వేయడం జరిగింది. దీంతో పలు రికార్డులు సైతం నమోదయ్యాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు జల్సా సినిమాను విడుదల చేయగా పోకిరి సినిమా రికార్డులను బద్దలైనట్లుగా ప్రకటించారు .ఈ రెండు చిత్రాల షోకు నెలకొన్న డిమాండ్ చూశాక సినిమా కలెక్షన్ల విషయంలో ఎలాంటి సందేహాలు రాలేదు.


కానీ బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా స్పెషల్ షోలు వేయగా దీనికి ముందు షోల సంఖ్య పరంగా కాస్త రికార్డు నమోదు అయినట్లు నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రెస్ మీట్ లో తెలియజేశారు. అయితే తాజాగా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు అంటూ రూ.5.39 కోట్ల రూపాయలు గ్రాస్ ప్రకటించారు అయితే ఈ సినిమాకు ఈ స్థాయిలో వసూలు అయ్యాయ కాలేదా  అనేది ట్రెండ్ వర్గాల మాట. చెన్నకేశవరెడ్డి చిత్రం యూఎస్ఏ లో బాగా సందడి చేసింది. ఎన్నో షోలు కూడా వేశారు. వాటికి డిమాండ్ కూడా భారీగానే ఉన్నది. కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఈ సినిమాకి అంతగా బజ్ ఏర్పడలేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: