బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి జాన్వి కపూర్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించిన జాన్వి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. కొన్ని రోజుల క్రితమే జాన్వి కపూర్ "గుడ్ లక్ జెర్రీ" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా జాన్వి కపూర్ "మిలీ" అనే  మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ హెలెన్‌ను హిందీ లో మిలీగా రీమేక్ చేశారు. హెలెన్‌ లో అన్నా బెన్‌ లీడ్‌ ప్రధాన పాత్రలో నటించగా.. ఇప్పుడా పాత్రను మిలీ లో జాన్వీ కపూర్‌  పోషించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని నవంబర్ 4 వ తేదీన ధియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో జాహ్న కపూర్ ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ హెలెన్‌ ఇప్పటికే ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. మరి మిలీ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై బాలీవుడ్ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: