టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే నాగ చైతన్య ఈ సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న నాగ చైతన్య అందుకున్నాడు.  

ఆ తర్వాత థాంక్యూ మూవీ ద్వారా నాగ చైతన్య ప్రేక్షకులను పలకరించాడు. అలాగే అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డా లో నాగ చైతన్య కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య ,  వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ నాగ చైతన్య కెరియర్ లో 22 వ మూవీ గా తెరకెక్కుతోంది.

మూవీ లో కృతి శెట్టి ,  నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇళయ రాజా ,  యువన్ శంకర్ రాజామూవీ కి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఈ మూవీ నుండి ఒక అదిరి పోయే అప్డేట్ ను రేపు ఉదయం 9 గంటల 46 నిమిషాలకు విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా నుండి రేపు మూవీ యూనిట్ ఏ అప్డేట్ విడుదల చేయబోతున్నారో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: