మె గాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రానికి ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. సెలెబ్రిటీల నుంచి కూడా ఈ చిత్రానికి ప్రశంసలు దక్కుతున్నాయి.మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రానికి ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. లూసిఫెర్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి తన స్టైల్, యాటిట్యూడ్, నటనతో అదరగొట్టేశారు. మోహన్ రాజా చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథని మార్చారు.

అయితే ఈ చిత్రానికి వసూళ్లు కాస్త నెమ్మదించినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఓటిటిలో తెలుగులో ఒరిజినల్ వర్షన్ అందుబాటులో ఉండడం లాంటి చాలా కారణాలు కలెక్షన్స్ డ్రాప్ కి కారణాలుగా చెబుతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి పెర్ఫామెన్స్ తో మాత్రం ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

సెలెబ్రిటీల నుంచి కూడా ఈ చిత్రానికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే పలువు సెలెబ్రటీలు ఈ చిత్రాన్ని అభినందించారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ దర్శకుడు మోహన్ రాజా ఆసక్తికర విషయాన్ని వివరించారు.ఉదయం 6 గంటలకు రాంచరణ్ ఫోన్ చేశారు. అనంతరం నా దగ్గరకు వచ్చి అభినందించారు. అంతే కాదు అల్లు అర్జున్ ఈ చిత్రం చూశారు. చూసిన తర్వాత నాతో ఫోన్ లో 21 నిమిషాలు మాట్లాడారు. మూవీ ఎంతో బావుందని అభినందించారు. పిచ్చెక్కించేశారు, సినిమా లడ్డూలా ఉంది అని అల్లు అర్జున్ అభినందించినట్లు మోహన్ రాజా పేర్కొన్నారు.అలాగే సాయిధరమ్ తేజ్ ఆఫీస్ కి వచ్చి మరీ అభినందించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే గాడ్ ఫాదర్ చిత్రాన్ని అభినందించిస్తూ మలయాళీ నటుడు, పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ కూడా తనకి మెసేజ్ చేసినట్లు మోహన్ రాజా తెలిపారు.

లూసిఫెర్ మలయాళీ చిత్రం అయినప్పటికీ.. గాడ్ ఫాదర్ చిత్రాన్ని కూడా బ్రిలియంట్ గా తెరకెక్కించినందుకు అందరి నుంచి అభినందనలు వెలువెత్తుతున్నాయి అని మోహన్ రాజా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: