హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా మకుటం లేని మహారాజుగా హాలీవుడ్ ని ఏలుతున్నాడు. మన టాలీవుడ్ కి మహేష్ బాబు ఎలాగో హాలీవుడ్ కి టామ్ క్రూయిజ్ అలాగ. 60 ఏళ్ల వయస్సులో కూడా చెక్కు చెదరని అందంతో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. టామ్. రీసెంట్ గా యుద్ధ విమానాల శిక్షణ నేపథ్యంలోని 'టాప్ గన్' మూవీతో  రికార్డ్ హిట్ అందుకున్నాడు. నటుడు దర్శకుడు డగ్ లిమాన్తో స్పేస్ వాక్ నేపథ్యంలోని ప్రాజెక్ట్ లో టామ్ భాగస్వామిగా ఉన్నారని తెలిసింది. హాలీవుడ్ నటుడు దర్శకుడు టామ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వరకు వెళ్లేందుకు సాహసిస్తున్నాడు. తన కెరీర్ లో ప్రయోగాలను మరో దశకు తీసుకుని వెళుతున్నాడు. దీనికోసం అతడు యూనివర్సల్ ఫిల్మ్డ్ ఎంటర్ టైన్ మెంట్ గ్రూప్ (UFEG)ని సంప్రదించినట్లు సమాచారం.ఈ ప్రాజెక్ట్ మొదట 2020లో చేయాలని భావించారు. కానీ కోవిడ్-19 వ్యాప్తి ప్రాజెక్ట్ ను నిలిపివేసింది. ఈ చిత్రం ప్రస్తుతం కాన్సెప్ట్ దశలో ఉంది. ఇంకా షూటింగ్ ప్రారంభించలేదు.ఇంతకుముందు ప్రకటించినట్లుగా ఈ చిత్రం విజయవంతమైతే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిత్రీకరించే మొదటి సినీ ప్రముఖుడు టామ్ క్రూయిజ్ అవుతాడు.


ఈ చిత్రానికి దాదాపు 200 మిలియన్ల డాలర్ల ఖర్చవుతుందని కథనాలొస్తున్నాయి. అయితే నిర్మాతలు ఇంకా తుది బడ్జెట్ ను ఖరారు చేయలేదని తెలిసింది. బహుశా టామ్ క్రూయిజ్ అతని చిత్ర బృందం తో కలిసి అంతరిక్షానికి వెళ్లడానికి భారీ ప్యాకేజీని కేటాయించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఎడ్జ్ ఆఫ్ టుమారో కాంబినేషన్ రిపీట్..ఏది ఏమైనా టామ్ స్పేస్ వాక్ చేసిన మొదటి నటుడిగా సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. యూనివర్సల్ పిక్చర్స్ అధినేత డోనా లాంగ్లీ- దర్శకుడు డగ్ లిమాన్ తో ఈ కొత్త యాక్షన్ సినిమా కోసం ప్రయత్నిస్తున్నామని ఒక ఇంటర్వ్యూలో  తెలిపారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కానీ టామ్ కూడా స్పేస్ వాక్ చేయాలనే ప్లాన్ ఉందని లాంగ్లీ చెప్పారు.టామ్తో ఒక ప్రాజెక్ట్ అభివృద్ధి దశలో ఉంది. అంతరిక్ష కేంద్రానికి రాకెట్ని తీసుకెళ్లి షూటింగ్ చేయడం .. అంతరిక్ష కేంద్రం బయట స్పేస్ వాక్ చేసిన మొదటి హీరోగా టామ్ నిలవడం కుదురుతుందని లాంగ్లీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: