బుల్లితెర వ్యాఖ్యాతగా రాణిస్తున్న హరితేజ మంచి అవకాశాలను చేజిక్కించుకుంటోంది. తనకంటూ ప్రత్యేకత చూపిస్తూ బుల్లితెరలో తానున్నానని నిరూపించుకుంటోంది.

అటు వెండితెరలోని రాణిస్తోంది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఎంతో కృషి  చేసి ఉండాలి. దానికి ప్రతిభతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి మరి . లేదంటే అవకాశాలు అంత తేలిగ్గా రావు. అటు బుల్లితెర ఇటు వెండితెరలో  తన తడాఖా చూపించుకోవాలంటే మన టాలెంట్ చూపెట్టాల్సిందే. లేకపోతే అంతేసంగతి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి ప్రకారం వయసులో ఉన్నప్పుడే అవకాశాలు దక్కించుకుంటే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చనే ఉద్దేశంతో సినిమా పరిశ్రమలో చాలా మంది అవకాశాల కోసం  ఎంతో ఎదురు చూస్తున్నారు.

కూచుపూడి నృత్య కళాకారిణి అయిన హరితేజ పలు తెలుగు టీవీ షోలలో నాట్యం చేసి సీరియల్స్ లో కూడా నటించింది. 2007 నుంచే సినిమాల్లో నటించాలని కలలు కన్నది. త్రివిక్రమ్ తీసిన అఆ సినిమాలో సమంత స్నేహితురాలి క్యారెక్టర్ లో ఒదిగిపోయింది. ఆ సినిమా అందించిన విజయంతో ఆమెకు గుర్తింపు దక్కింది. అప్పటి వరకు రాని క్రేజీ హరిప్రియకు ఆ సినిమాతో దక్కడం విశేషం. హరితేజ ఎన్నో రోజులు అవకాశాల కోసం పరితపించిన హరితేజ ప్రస్తుతం మంచి పొజిషన్ లో కొనసాగుతోంది.

బిగ్ బాస్ హౌస్ -1లో అడుగుపెట్టిన ఆమెకు మరింత పేరొచ్చింది. తరువాత అవకాశాలు వెల్లువెత్తాయి. తన చిరకాల వాంఛ తీర్చుకోవాలని భావించింది. రూ.3 కోట్లతో  ఒక ఇల్లు కూడా కొనుగోలు చేసింది. భర్త దీపక్ రావుతో కలిసి గృహ ప్రవేశం చేసింది. ఇంకా ఓ కోటి రూపాయలు పెట్టి ఓ ఖరీదైన కారు కొనుగోలు చేసింది. ఇలా తన జీవిత కోరికలు తీర్చుకుంది. మంచి ఇల్లు, తిరగడానికి వాహనం కొనుక్కుని తన ఆశలు నెరవేర్చుకుంది. త్రివిక్రమ్ సినిమాతో హరితేజ క్రేజీ సంపాదించుకుంది. అత్తారింటికి దారేది సినిమా ద్వారా నదియాకు కూడా ఎంతో ప్రాచుర్యం వచ్చేలా చేసింది త్రివిక్రమ్ అని తెలిసిందే. దీంతో ప్రస్తుతం హరితేజ తన కోరికలు తీర్చుకుని ఇటు యాంకర్ గా అటు నటిగా తన పేరుని నిరూపించుకుని తన ఆశయం నెరవేర్చుకుంటోంది.


హరితేజ త్వరలో తల్లి కూడా కాబోతోందట మరి ఏదిఏమైనా హరితేజ తన జీవితంలో అన్ని అవసరాలు తీర్చుకుని సంతోషంగా ఉండేందుకు అటు బుల్లితెర ఇటు వెండితెర తోడవుతోంది. అవకాశాలను అందిపుచ్చుకుని తానేమిటో నిరూపించుకుంటోంది. తనలోని ప్రతిభా పాటవాలను ప్రదర్శించి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు పరోక్షంగా తోడ్పడింది త్రివిక్రమ్ అని చెబుతున్నారు. అఆ సినిమాతోనే తనలోని నటనను బయటపెట్టింది. తానేమిటో చెప్పకనే చెప్పింది. హరితేజకు మరిన్ని అవకాశాలు వచ్చి ఆమె మరింత పేరు తెచ్చుకోవాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: