ప్రస్థుతం స్టూడియోల పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితులలో అల్లు ఫ్యామిలీ ఏధైర్యంతో అల్లు స్టూడియోస్ ను ప్రారంభించారు అని చాలామంది ఆశ్చర్యపడుతున్న సందర్భానికి సమాధానం దొరికినట్లు కొంతమంది భావిస్తున్నారు. దర్శకుడు సుకుమార్    ‘పుష్ప 2’ ను భారీ స్థాయిలో తీయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.


‘పుష్ప 2’ పై భారీ అంచనాలు పెరిగిపోవడంతో ఈమూవీ కథలో ఇప్పటికే అనేక మార్పులు చేసిన సుకుమార్ ఈమూవీని సహజత్వం కోసం బ్యాంకాక్ ఫారెస్ట్ లోను అదేవిధంగా కెన్యా పర్వతాల పైనా ఈమూవీ షూటింగ్ ను తీయాలని సుకుమార్ భావించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి బ్యాంకాక్ కెన్యా ప్రభుత్వాల నుండి అనుమతులు రావడంలో ఆలస్యం జరగడంతో పాటు బ్యాంకాక్ అరణ్యాలలో తరుచూ వానలు వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావడం ఆలస్యం అయిన ‘పుష్ప 2’ మరింత ఆలస్యం కాకూడదని అల్లు స్టూడియోస్ లో బ్యాంకాక్ అరణ్యాన్ని పోలినట్లుగా ఒక దట్టమైన కృత్రిమ అడవిని కెన్యా పర్వతాలను పోలినట్లుగా కృత్రిమ పర్వతాల సెట్ ను సుకుమార్ డిజైన్ చేయిస్తున్నట్లు టాక్.


ఈ సెట్ డిజైనింగ్ లో ఆలస్యం జరుగుతూ ఉండటంతో ఈమూవీ షూటింగ్ ఆలస్యం అవుతోందని అంటున్నారు. ఈసినిమాకు సంబంధించి అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈమూవీ షూటింగ్ వచ్చేనెల ప్రారంభించి ఎక్కడా గ్యాప్ లేకుండా షూటింగ్ కొనసాగించి 6 నెలలలో ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది దసరా కు ఈమూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదలచేయాలని సుకుమార్ ప్లాన్ అని అంటున్నారు.


ఇది ఇలా ఉండగా ‘పుష్ప 2’ లో అల్లు అర్జున్ పక్కన మరొక హీరోయిన్ ఉంటుందని రష్మిక పాత్ర పార్ట్ 2 కథ మధ్యలో పాత్రను ముగించడంతో ఈమూవీలో సెకండ్ హీరోయిన్ ఎంటర్ అవుతుంది అని అంటున్నారు. ఈమూవీలో పుష్పరాజ్ అంతర్జాతీయ స్మగలర్ గా ఎలా ఎదిగి ఎలా పతనం అవుతాడు అన్న కథతో ‘పుష్ప 2’ ఉంటుందని ప్రచారం జరుగుతోంది..    



మరింత సమాచారం తెలుసుకోండి: