తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు పేరుకు పరిచయం అక్కర్లేదు..యావత్ సినీ ప్రేక్షకులకు ఈయన అంటే ఒక క్రేజ్ ఉంది..ఈ మధ్య మహేష్ బాబు వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఇప్పుడు ఓ న్యూస్ ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కోడుతుంది..ఇండస్ట్రీలో కొన్ని కొన్ని జంటలు తెరపై భళే ముద్దుగా ఉంటాయి . నిజంగా ఎవరైనా సరే రిలేషన్ షిప్ తెలియని వాళ్ళు చూస్తే నిజం లవర్స్ అని లేదా భార్యాభర్తలను అనుకుంటారు.మహేష్ బాబు-భూమిక. వీళ్ళిద్దరి కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు చూడ చక్కగా ముచ్చటగా ఉంటారు.


తెర పై ఈ జంట కనిపిస్తే చాలు ఆడియన్స్ విజిల్స్ తీ కేకలు వేస్తూ రచ్చ రంబోలా చేస్తారు. వీళ్లిద్దరు కలిసి నటించిన సినిమా ఒక్కడు . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు కొల్లగొట్టింది, అప్పటివరకు మహేష్ బాబు సైలెంట్ హీరో అని అంతా అనుకున్నారు. కానీ మహేష్ బాబును జనాలకు దగ్గర చేసిన సినిమా ఒక్కడునే. 2003లో రిలీజ్ అయిన ఈ సినిమా సినీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది . గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా..భూమిక హీరోయిన్గా నటించింది . అంతేకాదు ప్రధాన పాత్రలో ప్రకాష్ రాజ్ ఇరగదీసాడు . ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మణిశర్మ సంగీతం .ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు మన ప్లే లిస్ట్ లో ప్లే అవుతూనే ఉంటాయి..


తమిళం,కన్నడ, హిందీ ,బెంగాలీ భాషల్లో పునర్మితమైంది. కాగా నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా మొదట అనుకునింది గుణశేఖర్ సోనాలి బింద్రే నట. మహేష్ బాబు సరసన అప్పటికే మురారి సినిమాలో నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సోనాలి ..ఈ సినిమాలో నటిస్తే మరీ అందంగా ఉంటుందని సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని అనుకున్నారట. అయితే మహేష్ బాబు మాత్రం తన సినిమాలో సోనాలి వద్దు అంటే వద్దు అని మొండి చేశాడట.


మురారి సినిమాలో ఆల్రెడీ ఒకసారి మా ఇద్దరి జంటని తెరపై చూసేసారు ..మళ్ళీ అదే హీరోయిన్ ని రిపీట్ చేస్తే జనాలకి బోర్ కోడుతుంది..ఎవరైనా అమ్మాయి పడితే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. జనాలకు ఇంట్రెస్ట్ కలుగుతుంది " అంటూ చెప్పాడట.అప్పుడు ఒక్కసారిగా భూమిక పేరు హైలెట్ గా మారడం ఆమెని సినిమాలోఖి తీసుకోవడం జరిగింది. సినిమాలో ఆమె నటించిన నటనకు అందరూ ఫిదా అయ్యారు..ఇప్పటికీ ఆ సినిమాకు మంచి క్రేజ్ ఉంది..అది అసలు మ్యాటర్..


మరింత సమాచారం తెలుసుకోండి: