జూనియర్ నటించిన ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలై ఆరు నెలలు గడిచిపోతోంది. ఇన్ని నెలలు గడిచినా తారక్ కొరటాల శివ దర్శకత్వంలో మొదలు పెట్టవలసి ఉన్న మూవీ షూటింగ్ వాయిదాలు మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. కొరటాల శివ ఫైనల్ చేసిన కథ జూనియర్ కు నచ్చకపోవడంతో కొరటాల రకరకాల వెర్షన్స్ తో ఈకధను మారుస్తున్నా ఏ వెర్షన్ కూడ తారక్ కు పూర్తి సంతృప్తిని ఇవ్వకపోవడంతో ఇలా ఆలస్యం జరుగుతోంది అన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ దీని వెనుక మరొక కారణం ఉంది అని అంటున్నారు.


‘ఆచార్య’ ఫెయిల్యూర్ కొరటాలకు కంటే జూనియర్ కు మరింత షాక్ ను ఇచ్చిందని దీనితో అసలు కొరటాల తో సినిమా చేయాలా వద్దా లేకుంటే ఏకారణంతో ఈమూవీ ప్రాజెక్ట్ నుండి తాను సున్నితంగా తప్పుకోవాలి అన్న కన్ఫ్యూజన్ వల్ల ఇంత ఆలస్యం జరుగుతోంది అంటూ మరికొన్ని గాసిప్పులు వస్తున్నాయి. గతంలో వక్కంతం వంశీ విషయంలో జూనియర్ కొన్ని నెలలు కథ పై రకరకాల చర్చలు చేసి చివరి నిముషంలో తప్పుకున్నట్లుగా ఇప్పుడు లేటెస్ట్ గా కూడ కొరటాల విషయంలో అదే జరగవచ్చు అన్న ఊహాగానాలు కూడ వస్తున్నాయి.


అయితే కొరటాల సన్నిహితులు మాత్రం ఈవిషయంలో మరొక విధంగా స్పందిస్తున్నట్లు టాక్. తారక్ ఎవరికైనా మాట ఇస్తే ఆ మాటను తప్పడనీ అందువల్ల కొరటాల విషయంలో జూనియర్ వెనకడుగు వేసే ప్రశక్తి లేదు అని అంటున్నారు.


ఇది ఇలా ఉండగా ఈమూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో క్లారిటీ లేకపోయినప్పటికీ ఈమూవీలో నటించవలసి ఉన్న హీరోయిన్ ఎంపిక విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ విషయంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను సంప్రదిస్తే ఆమె కొరటాల కు సానుకూలంగా స్పందించలేదనీ మరొక గాసిప్ హడావిడి చేస్తోంది. దీనితో ఇన్ని రూమర్ల మధ్య అసలు కొరటాల జూనియర్ల మూవీ ఈ సంవత్సరంలో షూటింగ్ ప్రారంభం అవుతుందా అవ్వదా అంటూ మరికొందరు వస్తున్న ఈ గాసిప్పులు విని కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: