తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంట్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే విశ్వక్ సేన్ ఆఖరుగా అశోక వనంలో అర్జున కళ్యాణం అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనా నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ సేన్ "ఓరి దేవుడా" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి అశ్వద్  మారిముత్తు దర్శకత్వం వహించగా , మిథిలా పాల్కర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. విక్టరీ వెంకటేష్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది.

మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ... నిజ జీవితంలో నేను విశ్వక్ సేన్ వ్యక్తిత్వానికి పెద్ద అభిమానిని.  ఇచ్చిన మాట పైన నిలబడే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. అలా నిలబడతాను అని నాకు చిన్న పేరు ఉంది. అలాగే మంచో ... చెడో ,  తప్పో ... ఒప్పో మాట ఇచ్చాడు అంటే దానిపైన నిలబడతాడు అని విశ్వక్ సేన్ కి కూడా ఇండస్ట్రీ లో ఒక మంచి పేరు ఉంది. మూవీ లు హిట్ అవ్వచ్చు ... ప్లాప్ అవచ్చు ...  కానీ రజనీ కాంత్ గారు , పవన్ కళ్యాణ్ గారు ,  చిరంజీవి గారు చాలా కాలం సూపర్ స్టార్స్ లా ఉన్నారు. అంటే అది వాళ్ళ వ్యక్తిత్వం వల్లనే , వాళ్లందరి లాగానే నువ్వు కూడా ఎప్పుడు నీలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను అంటూ రామ్ చరణ్ చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: