టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు ఆయన విశ్వక్ సేన్ ఇప్పటికే అనేక మూవీ లలో హీరోగా నటించిన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ నగరానికి ఏమైంది మూవీ తో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న విశ్వక్ సేన్ ఆ తర్వాత ఫలక్ నామ దాస్ ,  పాగల్ , అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో ఓరి దేవుడా అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో కనిపించ బోతున్నాడు. ఈ మూవీ కి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా చాలా ఘనంగా నిర్వహించింది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఓరి దేవుడా మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఓరి దేవుడా మూవీ ని మూవీ యూనిట్ 2 గంటల 23 నిమిషాల నిడివితో  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ఏ రేంజ్ విజయ్ బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: