ఇకపోతే ఈ రీమేక్ కు దర్శకుడు మాత్రం హరీష్ శంకర్ మాత్రం కాదు. కేవలం కథ, కధనం అందించనున్నాడు. కాగా దశరథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అలాగే మన రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. భవదీయుడు భగత్ సింగ్ సినిమా కోసం హరీష్ శంకర్ ఎదురుచూసి, చూసి నీరసపడిపోయారు. ఆ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేక హరీష్ శంకర్ గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ మానాడు తెలుగు రీమేక్ కు వర్క్ చేస్తున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.మానాడు సినిమాలో ఎస్ జె సూర్య చేసిన పాత్ర కోసం రవితేజ ను అడుగుతున్నట్లు సమాచారం. అంటే ఆ పాత్ర విలన్ పాత్ర. మరి రవితేజ అభిమానులు ఆ పాత్ర చేస్తే జీర్ణించుకుంటారా లేదా అన్నది చూడాలి. అయితే ఆ పాత్ర చాలా డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్ర కనుక రవితేజ చాలా ఇష్టపడి చేస్తాడని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. మరో ప్రక్క శింబు చేసిన పాత్రలో సిద్దూ జొన్నలగడ్డ కనిపించనున్నారని చెప్తున్నారు. అయితే ఈ విషయంపైన ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.