శివ కార్తికేయన్ హీరోగా నటించిన ప్రిన్స్ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 21వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా జరిపింది. నిన్న ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్గా జరగగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హాజరు కావడం విశేషం.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర కామెంట్లు చేయడం ఆయన అభిమానులలో ఎంతో ఆసక్తిని కలుగచేస్తుంది అని చెప్పాలి. లైగర్ సినిమాతో భారీ స్థాయిలో ఫ్లాప్ ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ దాని నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు రావడం మొదలు పెడుతున్నాడు. మొదటి నుంచి వెనకడుగు వేయని మనస్తత్వం ఉన్న విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న లైజర్ సినిమా ఫ్లాప్ అవడం నిజంగా చాలా మందిని నిరాశపరిచింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన ప్రిన్స్ ఆడియో వేడుక కు హాజరు కావడం ఆయన అభిమానులలో ఎక్కడలేని సంతోషాలను తెచ్చిపెట్టింది.

శివ కార్తికేయ లాంటి హీరోను ఇప్పటిదాకా చూడలేదని ఎంతో కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి అని ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని విజయ్ దేవరకొండ వెల్లడించడం ఇప్పుడు చాలామందిలో ఎంతో ఆనందాలను కలుగజేస్తుంది. ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొంటున్న విజయ్ దేవరకొండ తొందర్లోనే తన తదుపరి సినిమాలను కూడా ఓకే చేసుకునే పనిలో ఉన్నాడు. మరి దర్శకులు ఎవరైనా వీరిద్దరి బాడీ లాంగ్వేజ్ కు ఇమేజ్ లకు తగ్గ కథను సిద్ధం చేసి వారికి వినిపిస్తారా అనేది ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇకపోతే శివ కార్తికేయని ఈ సినిమా తర్వాత కూడా మరొక తెలుగు దర్శకుడు తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అన్న వార్తలుప్ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తెగ హల్చల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: