మనం చూసే సినిమాలో కల్పిత కథలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతాయి. అదే క్రమంలో కొన్ని సినిమాలు మాత్రం మనిషి జీవితంలో జరిగిన సంఘటనలు, మనుషుల యొక్క జీవిత కథలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన సినిమాలు కూడా ఉన్నాయి.అలా తెరాకెక్కిన సినిమాలు కూడా ప్రేక్షకులను చాలా విపరీతంగా అలరించాయి. ఇక అలాంటి కోవలోకి చెందిన సినిమా అందాల నటుడు శోభన్ బాబు నటించిన సర్పయాగం సినిమా. ఈ సినిమాను పరుచూరి బ్రదర్స్ తెరకెక్కించారు, ఈ సినిమాకు మూవీ మొగల్ రామానాయుడు నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాలో శోభన్ బాబు కూతురుగా రోజా నటించింది.. ఇది రోజాకు రెండో సినిమాగా తెరకెక్కింది.ఈ సినిమా ఓ మనిషి నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా తెరకెక్కించారని చాలామందికి తెలియదు. ఈ సినిమా కథ నిజంగా ఒంగోలులో జరిగింది. ఆ టైంలో ఒంగోలులో గుండాయిజం, రౌడీయిజం ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో జరిగిన కథ.. ముగ్గురు యువకులు ఓ కాలేజీ యువతపై మానభంగం చేశారు. ఆ యువతి తండ్రి పేరు కోదండరామిరెడ్డి ఈయనకు డ్రై క్లీనింగ్ దుకాణం ఉంది దీని పేరు టిప్ టాప్ కావడంతో ఆయన టిప్ టాప్ రామిరెడ్డిగా ఒంగోలులో ఫేమస్ అయ్యారు. రామిరెడ్డికి తన కూతురు చిన్నతనంలోనే భార్య మరణించింది. దీంతో కూతురును చాలా ప్రేమగా పెంచుకున్నాడు.కూతురు చదువు పూర్తయిన తర్వాత వివాహం జరిపించాలని ఎన్నో కలలు కన్నారు. రామరెడ్డి కలలను చిదిమేస్తూ. కూతురు ను ముగ్గురు మానవ మృగాల చేతిలో మానభంగానికి గురైంది ఆ బాధను తట్టుకోలేక తనకు జరిగిన అన్యాయాన్ని ఉత్తరంలో రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఉత్తరంలో కూతురు ఎంతో బాధతో ఆ ముగ్గురుని వదిలిపెట్టద్దు నాన్న అని రాసి ఎంతో బాధ ఆవేదనతో తండ్రికి చివరి లేఖ రాసింది. ఆ ముగ్గురు యువకుల గురించి వస్తే ఒంగోలులో చిల్లరగా తిరిగేవారు. వారిలో డబ్బు అధికారం రాజకీయ బలం కలిగిన యువకులు కూడా ఉన్నారు.ఆ ముగ్గురిలో ఒకడు హాకీ కోచ్. మరొకడు ఆర్టీసీ డిపో మేనేజర్ కొడుకు, వాడికి డబ్బు పొగరే కాకుండా రాజకీయ బలం కూడా ఉంది. మూడో వాడు ఒక తాగుబోతుని కూతురు రాసిన ఉత్తరంలో ఉంది. ఆ ఉత్తరం చదివిన టిప్ టాప్ రామి రెడ్డి కోపంతో రగిలిపోయాడు. ఎలా అయినా ఆ ముగ్గురిని చంపి తన కూతురుకు ఆత్మశాంతి కలిగించాలని… ఇద్దరు కిరాయి మనుషులతో కలిసి తన కూతుర్ను పాడుచేసిన ఇద్దరి మానవ మృగాలను చంపేశాడు. తర్వాత పోలీసులకు దొరికిపోయాడు. ఈ విషయం ఒంగోలులో ఆ నోట ఈ నోట పడి టిప్ టాప్ రామిడ్డి హీరో అయిపోయాడు. అలా ఈ విషయం ఓ రోజు పేపర్లో వచ్చింది ఈ వార్తను చూసిన పరుచూరి బ్రదర్స్.. దీన్నే సినిమా కథగా మార్చి సర్పయాగం అనే సినిమా తీశారు. ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ ను షేక్‌ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: