జ్యోతిక… ఈ హీరోయిన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగులో స్టార్ హీరోలైన చిరంజీవి,నాగార్జున వంటి వారితో సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఈమె తెలుగులో కన్నా తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. ఇక కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలోనే తమిళ స్టార్ హీరో అయినా సూర్యని పెళ్లి చేసుకొని కొన్ని రోజులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ప్రస్తుతం వీళ్ళు కోలివుడ్ లోనే మోస్ట్ లవ్లీ కపుల్స్ గా పేరు సంపాదించుకున్నారు.

ఇక పెళ్లి తర్వాత పిల్లలు పుట్టాక కొన్ని రోజుల పాటు ఫ్యామిలీ లైఫ్ కే తన జీవితాన్ని అంకితం చేసి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు 36 వయదినిలే అనే సినిమా తో మళ్లీ సినిమా ఇండస్ట్రీలో కి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ ఇచ్చాక వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. తాజాగా ఓ పెద్ద స్టార్ హీరో పక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఆ హీరో ఎవరో కాదు మలయాళ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మమ్ముట్టి. అయితే జ్యోతిక హీరోయిన్ గా మంచి ఊపులో ఉన్న టైంలో మమ్ముట్టి సరసన హీరోయిన్ గా నటించలేదు. కానీ కెరియర్ ఈ దశలో ఉన్న టైంలో ఈ సూపర్ స్టార్ హీరో పక్కన హీరోయిన్ గా నటిస్తుందని కనీసం ఎవరు కూడా ఊహించిఉండరు.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాకి కాదల్ అనే టైటిల్ పెట్టారు. కాదల్ అంటే ప్రేమ అని అర్థం. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. ఇక దాన్ని చూస్తే అందులో ఒక నొస్టాల్జిక్ ఫీల్ కనిపిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్న జ్యోతిక మమ్ముట్టి ల ఫోటో చాలా లవ్లీగా కనిపిస్తోంది. ఇక ఫస్ట్ లుక్ ను చూస్తే చాలా మందిలో ఒక క్లాసిక్ ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాకి జియో బేబీ అనే డైరెక్టర్ మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అలాగే మమ్ముట్టి తన సొంత నిర్మాణంలో ఈ సినిమాని నిర్మించడం విశేషం. అయితే జ్యోతిక మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే కాబట్టి ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేస్తారని చాలా మంది భావిస్తున్నారు. ఇక జ్యోతిక మమ్ముట్టి ల కాంబినేషన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: