ఈ ‘దీపావళి’ రేస్ కు కార్తీ నటించిన ‘సర్ధార్’ మూవీ కూడ విడుదల కాబోతోంది ఈమూవీలో కార్తీ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం పరాజయాలు వెంటాడుతున్న తరుణంలో కార్తి కెరియర్ కు ఒక హిట్ కావాలి అలాంటి హిట్ ‘సర్ధార్’ ఇస్తుందని కార్తి ఆశతో ఉన్నాడు. దీనికోసం ఈ మూవీ చాల ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడు.


తెలుగు తమిళ భాషలలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో ముఖ్య అతిధిగా వచ్చిన నాగార్జున చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు జోష్ ను ఇస్తున్నాయి. గతంలో నాగార్జున కార్తి కలిసి ‘ఊపిరి’ సినిమాలో నటించినప్పటి నుంచి వీళ్ళిద్దరి సాన్నిహిత్యం బాగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ సాన్నిహిత్యంతో నాగ్ కార్తీని పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ కామెంట్స్ చేసాడు.


ఒక కుటుంబంలో ఒక టాప్ హీరో ఉన్నప్పుడు అదే కుటుంబం నుండి మరొక హీరో వచ్చినప్పటికీ అతడికి టాప్ హీరో స్థానం దక్కడం చాల కష్టం అనీ అయితే చిరంజీవి లాంటి టాప్ హీరో నీడలో పెరిగిన పవన్ తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్న విషయాన్ని ఈ సందర్భంలో ప్రస్తావిస్తూ ఈ విషయం కార్తికి కూడ వర్తిస్తుంది అన్నాడు. తమిళ హీరోలలో సూర్య టాప్ హీరోల స్థానంలో కొనసాగుతున్నాడని అయినప్పటికీ కార్తి సూర్య తమ్ముడుగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకోవడం ఆయన కృషికి నిదర్శనం అంటూ కార్తీ పై ప్రశంసలు కురిపించాడు నాగార్జున.


వాస్తవానికి ఎంతోమంది తెలుగు హీరోలు ఉన్నప్పటికీ కార్తికి తెలుగు రాష్ట్రాలలో కూడ చాలామంది అభిమానులు ఉన్నారు. అతడు నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడ హిట్ అయ్యాయి. అయితే గత కొంత కాలంగా వరస ఫ్లాప్ లు అతడిని వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ దీపావళి కార్తికి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: