ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్ ఎప్పటి కప్పుడు దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వేలు నిర్వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఈ మీడియా సంస్థ దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలు ఎవరు అనే దానిపై సర్వే ను నిర్వహించింది. తాజాగా ఈ మీడియా సంస్థ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో  మన తెలుగు హీరోలు కూడా మంచి స్థానాలలో నిలిచారు.  ప్రస్తుతం ఈ మీడియా సంస్థ నిర్వహించిన దేశ వ్యాప్త సర్వేలో కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన దలపతి విజయ్ మొదటి స్థానంలో నిలిచాడు.  ఆ తర్వాత రెండవ స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు.  ఆ తర్వాత మూడవ స్థానంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు.  ఆ తరువాత నాలుగవ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచాడు. 

ఆ తర్వాత ఈ సర్వే లో పదవ స్థానంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచాడు. ఇక ఈ మీడియా సంస్థ నిర్వహించిన దేశ వ్యాప్త సర్వేలో బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే నిలిచాడు. అక్షయ్ కుమార్సర్వే లో 5 వ స్థానంలో నిలిచాడు. ఇది ఇలా ఉంటే ఆరవ స్థానంలో ఈ సర్వేలో తమిళ సినిమా ఇండస్ట్రీ లోని సూర్య నిలవగా ,  ఏడవ స్థానంలో అజిత్ నిలిచాడు.  ఈ సర్వే లో కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి ఇద్దరు హీరోలు నిలిచారు. అందులో  8 వ స్థానంలో కిచ్చా సుదీప్ నిలవగా , 9 వ స్థానంలో కే జి ఎఫ్ మూవీ లో హీరోగా నటించిన యాష్ నిలిచాడు. తాజాగా ఈ మీడియా సంస్థ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో ఈ హీరోలు ఈ స్థానాల్లో నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: