మహానటుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఎవ్వరు అందుకోలేని శిఖరాగ్ర స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణాలలో ఆయన పట్టుదల , కృషి మరియు టాలెంట్ తో పాటుగా డిసిప్లైన్ కూడా ఒకటి అని చెప్పొచ్చు..ఆయన డిసిప్లైన్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో..తన చుట్టుపక్కన వాళ్ళు డిసిప్లైన్ గా లేకపోతే ఎలా కోపపడేవారో తెలియడానికి ఒక ఉదాహరణ ఉంది..ఎన్టీఆర్ గారి కెరీర్ లో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా చిత్రాలలో ఒకటి గుడి గంటలు.
1964 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది..అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో ఒక సంఘటన చోటు చేసుకుంది..ఈ చిత్రానికి నిర్మాతగా డూండీ గారు వ్యవహరించగా, వి.మధుసూదన్ గారు దర్శకత్వం చేసారు..కథ రీత్యా ఎన్టీఆర్ గారి పాత్ర ఈ సినిమాలో సిగరెట్లు కాల్చాలి..ఎన్టీఆర్ గారికి స్వతహాగా సిగెరెట్ కాల్చే అలవాటు అప్పటికి పెద్దగా లేదు.

కానీ పాత్రలో జీవించడం కోసం ఆయన సిగెరెట్ ని ఈ సినిమా కోసం గా నేర్చుకున్నారు..స్టేట్ ఎక్స్ ప్రెస్ అనే బ్రాండ్ సిగరెట్ రోజుకి రెండు ప్యాకెట్లు కేవలం ఈ సినిమా కోసమే తాగేవారట..ఇవి ఫారిన్ బ్రాండెడ్ సిగరెట్లు..సాధారణమైన షాప్స్ లో దొరకవు..ఒకరోజు షూటింగ్ లో లంచ్ టైం పూర్తి అయినా తర్వాత ఎన్టీఆర్ కోసం ఒక షాట్ ని రెడీ చేసి ఉంచారు..అప్పటికే నిర్మాత డూండీ గారు ఎన్టీఆర్ కోసం తెప్పించిన సిగరెట్ సీల్ ని తీసి అలాగే పడేసారు..మరో సిగరెట్ ప్యాకెట్ ని తెప్పించడానికి తన అసిస్టెంట్ ని పంపించాడు..కానీ ఆ బాయ్ బయటకి వెళ్లి తెచ్చే సమయం లేకపోవడం తో అక్కడ సీల్ తీసి పడేసి ఉన్న సిగరెట్ ప్యాకెట్ ని ఎన్టీఆర్ కి తెచ్చి ఇచ్చాడు.

అది గమనించిన ఎన్టీఆర్ చాలా కోపానికి గురైయ్యాడు..తనకి సీల్ తియ్యని కొత్త సిగెరెట్ ప్యాకెట్ ఇస్తేనే సెట్స్ లోకి వస్తాను..లేకపోతే రాను అని చెప్పి మేకప్ రూమ్ కి వెళ్లి కూర్చున్నాడు ఎన్టీఆర్..నిర్మాత డూండీ ఎన్టీఆర్ గారి కోపాన్ని చల్లార్చడానికి తన అసిస్టెంట్ ని వెంటనే అర్జెంటు గా సిగరెట్ ప్యాకెట్ తీసుకొని రమ్మనిఅయితే అప్పటికే స్టాక్ అయిపోయింది..ఇదే బ్రాండ్ సిగరెట్ ఎక్కడ దొరుకుతాయి అని ఆ షాప్ ఓనర్ ని అడగగా, సరిగ్గా ఇక్కడి నుండి ఆరు మైళ్ళ దూరం లో ఉంటుందని చెప్పాడు..ఆరు మైళ్ళ దూరం వెళ్లి ఆ సిగరెట్ ప్యాకెట్ తెచ్చేలోపు సాయంత్రం నాలుగు గంటలు అయిపోయింది..అప్పటి వరుకు ఎన్టీఆర్ మేకప్ రూమ్ నుండి బయటకి రాలేదు..షూటింగ్ నిలిచిపొయ్యే ఉన్నది..చివరికి సిగరెట్ ప్యాకెట్ వచ్చిన తర్వాత నిర్మాత డూండీ ఎన్టీఆర్ కి ఇస్తూ సారీ చెప్పాడు..నా కోపం అంతా సిగరెట్ కోసం కాదు బ్రదర్..డిసిప్లిన్ కోసం..అది సరిగ్గా ఫాలో అవ్వకపోతే నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: