తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న యువ హీరోలలో ఒకరు అయినా సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పేపర్ బాయ్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న సంతోష్ శోభన్ "ఏక్ మినీ ఖాతా" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే సంతోష్ శోభన్ కొంత కాలం క్రితమే మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ  హీరో లైక్ షేర్ సబ్స్క్రయిబ్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ కి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా ,  జాతి రత్నాలు బ్యూటీ ఫరీయ అబ్దుల్లా ఈ మూవీ లో సంతోష్ శోభన్ సరసన హీరోయిన్ గా నటించింది. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని నవంబర్ 4 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ ను అక్టోబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం లైక్ షేర్ సబ్స్క్రయిబ్ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: