శివకార్తికేయన్ కథానాయకుడిగా, అనుదీప్ కెవి దర్శకత్వంలో తమిళ్ లో తెరకెక్కిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ 'ప్రిన్స్స. తెలుగులోనూ  కూడా విడుదలైంది. మారియా ర్యాబోషప్క కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం గురించి దర్శకుడు అనుదీప్ కెవి విలేఖరుల సమావేశంలో తన ఆలోచనలను  ఇలా పంచుకున్నారు.


అన్ని చోట్ల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది అని దర్శకుడు పేర్కొన్నారు. ప్రేక్షకులు హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. తమిళ్ లో కూడా మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. రెండో రోజు నుండి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తెగ పెరుగుతున్నారు. తెలుగులో మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది మరీ

సెటైరికల్ కామెడీ మీ బలం కదా .. వేరే జోనర్ సినిమాలు చేసే ఆలోచన ఉందా అని అడిగితే

 అనుడీప్ ఇలా అన్నాడు,నాకు బాలచందర్ గారి సినిమాలు అంటే  చాలా ఇష్టం. ఆయన తరహాలో ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేయాలని  కూడా వుంది.

ప్రిన్స్ తెలుగుకి సరిపడే కథ కదా .. తమిళ్ లో చేయడానికి కారణం ఏంటి.

ఒక కోస్టల్ ఏరియాలో జరిగే కథ ఇది మరీ. దాని తగిన వాతావరణం క్రియేట్ చేశాం. తెలుగు వెర్షన్ మేము ఊహించినదాని కంటే గొప్ప ఆదరణ లభించింది. తెలుగు నటీనటులని తీసుకొని బైలింగ్వల్ గా చేయాలని అనుకున్నాం అయితే చాలా మార్పులు వస్తాయి. సమయం పడుతుంది. అలాగే పెద్ద హీరోల సినిమాకి రిలీజ్ సమయం ఒక సవాల్ గా వుంటుంది మరి

ప్రస్తుత పరిస్థితులలో దేశభక్తి కంటే మానవత్వం గొప్పదనే ఆలోచననే ప్రిన్స్ కథకు స్ఫూర్తి. దీనిని వినోదాత్మకంగా చెప్పాలని అనుకున్నాం.ఇందులో వార్ సీన్ అన్ రియల్ ఇంజన్- వర్చువల్ రియాలిటీలో అనే కొత్త టెక్నాలజీలో చేశాం అని అనుడీప్ పేర్కొన్నారు.

 
జెస్సికా మాత్ర కోసం చాలా వెదికాం. మారియ చాలా బాగా ఆడిషన్స్ ఇచ్చింది. ఆడిషన్స్ తర్వాత జెస్సికా పాత్రకు మరియా పర్ఫెక్ట్ అనిపించింది. భాష విషయంలో కొంచెం ఇబ్బంది వుండేది. సీన్ పేపర్ ని రెండు రోజులు ముందుగానే ఇచ్చేవాళ్ళం హీరోయిన్ కి

సత్యరాజ్ గారి తో పని చేయడం ఎలా అనిపించింది ?

సత్యరాజ్ గారి తో పని చేయడం  చాలా వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ ఇది నాకు. షూటింగ్ చివరి రోజు ఆయన్ని చాలా మిస్ అయ్యాను. తన పాత్రని చాలా అద్భుతంగా చేశారు.

జాతిరత్నాలు తర్వాత మీకే ఎక్కువ క్రేజ్ వచ్చింది.. మీరే ట్రెండింగ్ లో ఎక్కువగా వుంటారు కదా ? మీ సెటైర్ దీనికి కారణం అనొచ్చా ?

నిజానికి సినిమాల్లో సెటైర్ రాస్తానేమో గానీ రియల్ గా సెటైర్ గా మాట్లాడను. ఆ క్రేజ్ ఎందుకొచ్చిందో నాకూ తెలీదు. బేసిగ్గా నాకు కోపం రాదు నాకు, కామన్ గానే ఇలా వుంటాను.

తమన్ లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తో పని చేయడం చాలా ఆనందంగా వుంది. అలాగే మనోజ్ పరమహంస లాంటి టాప్ డీవోపీ పని చేయడం కూడా గ్రేట్ ఎక్స్ పీరియన్స్ ఇది నాకు అని డైరెక్టర్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: