మీరా జాస్మిన్.. మన తెలుగు సినిమాల్లో ఎంతో సాఫ్ట్ గా కనిపించి ఎలాంటి వివాదాలు లేకుండా కెరియర్ ను కొనసాగించింది. అయితే ఆమె మలయాళ ఇండస్ట్రీ ద్వారా తొలుత సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తమిళ, తెలుగు, కన్నడ సినిమాలతో బాగా పాపులర్ హీరోయిన్ గా ఎదిగిందట..

ఇక 10 ఏళ్లకు పైగా నటించిన మీరా ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. ఇక మీరా జాస్మిన్ కి సినిమా కాకుండా ఎక్కువగా వివాదాలు ఉండేవి. వ్యక్తిగత జీవితంలో ప్రేమలు, పెళ్లి వంటి విషయాల్లో ఆమె ఎక్కువ వార్తల్లో కూడా నిలిచింది.

ఎన్నో వివాదాలు నడుమ ఆమె 2014 ఫిబ్రవరి 12న తిరువనంతపురంలో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది మీరా జాస్మిన్. ఆమె భర్త దుబాయ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. అతడు పేరు అనిల్ జాన్సన్. అయితే మీరా జాస్మిన్ తో పెళ్లికి ముందే అనిల్ కి వేరొక అమ్మాయితో వివాహం కూడా కుదుర్చుకున్నాడు. మీరా జాస్మిన్ తో పెళ్లి సంబంధం రావడంతో అంతకు ముందు కుదుర్చుకున్న పెళ్లిని ఆపేసి మీరా జాస్మిన్ తో అనిల్ పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇది ఆ మధ్య కాలంలో పెద్ద వివాదమే సృష్టించిందిట.ఇక ఆమె వివాహ జీవితం కూడా 2017లో ముగిసిపోయింది.

ఇక్కడ వరకు అంత బాగానే ఉన్న ఆమె విడాకులు తీసుకోవడానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి కారణం అంటూ వార్తలు గుప్పుమన్నాయట.. దాంతో కుటుంబ సభ్యులు సైతం ఆమెను ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. ఇంట్లో వారి పోరు పడలేక ఆ సమయంలో ఆమె విడిగా ఉండేది. అదే సమయంలో ఆమెకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా మీరా జాస్మిన్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఉండేవి. దాంతో ఆమె తన ఆస్తులు కావాలని తన సొంత కుటుంబం పైనే కోర్టు కి ఎక్కిందట.. ఇక ఈ విషయంపై మీరా కుటుంబం సైతం స్పందించింది. ఆమె ప్రస్తుతం ఓ వ్యక్తి మోజులో ఉందని, అతడి వల్ల ఆమె కెరియర్ పాడయ్యే అవకాశం ఉందని, అంతేకాకుండా ఆమె ప్రాపర్టీ కూడా అతడు నాశనం చేస్తాడని భయంతోనే సదరు ప్రాపర్టీని ఆమెకు ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నాం అంటూ వివరణ కూడా ఇచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: