పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ సంవత్సరం భీమ్లా నాయక్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ,  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో ముద్దు గుమ్మ నిధి అగర్వాల్ , పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతున్న ,  మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ కొంత కాలం పాటు జరగకపోవడంతో ఇప్పటికి కూడా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో ఈ మూవీ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని ,  ఈ ట్విస్ట్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని తెలిపే విధంగా ఉంటుంది అని , తను చేసే సాయం తో తనకు గుర్తింపు కంటే కూడా.. ప్రజలకు మంచి జరగాలని కోరుకునే వ్యక్తి గా పవన్ కళ్యాణ్మూవీ లో కనిపిస్తాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: