పౌరాణిక చిత్రాల తర్వాత జానపద చిత్రాలకు ఆ రోజుల్లో అత్యంత ప్రాధాన్యత అయితే ఉండేది. ముఖ్యంగా జానపద చిత్రాలకు పెట్టింది పేరు కాంతారావు.. ఆయన తర్వాత జానపద చిత్రాలలో ఎక్కువగా కథానాయకుడుగా కనిపించింది నరసింహారాజు గారు మాత్రమే..


హీరో అయిపోదామని మద్రాస్ వచ్చిన నరసింహారాజు బిఏ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన నీడలేని ఆడది చిత్రంతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యారటా.ఆ తర్వాత అమ్మాయిలు జాగ్రత్త, మొగుడా పెళ్ళామా, తూర్పు పడమర వంటి చిత్రాలలో నటించినప్పటికీ ఇవన్నీ కూడా ఒకే సంవత్సరంలో నటించిన చిత్రాలు కావు. ఆయనకు ఒక సంవత్సరానికి గానూ ఒకే చిత్రంలో నటించే అవకాశం మాత్రమే వచ్చేది. అలా నరసింహారాజు సినీ పరిశ్రమకు వచ్చే ముందు ఏడాది వివాహం చేసుకున్నారు. పిల్లలతో కుటుంబాన్ని నడపాలి అంటే సంపాదన కూడా అంతే ఉండాలి. సినిమా అవకాశాలు రాకపోవడం వల్ల కుటుంబాన్ని గడపడం చాలా కష్టంగా అనిపించేది.

 

ఈ క్రమంలోనే ఆయన వేషాల కోసం జానపద బ్రహ్మ విఠలాచార్యను కలవడానికి వెళ్లారు. అప్పుడు జగన్మోహిని చిత్రం కోసం నటీనటుల ఎంపిక జరుగుతుంది. ఇందులో జయమాలిని లీడ్ రోల్ పోషించగా కథానాయకుడు కోసం ఒకరిద్దరి పేర్లు విఠలాచార్య పరిశీలిస్తున్నారు. ఆ జాబితాలో నరసింహారాజు పేరు కూడా ఉండడం ఓ విశేషం వెతకబోయిన తీగ కాలుకు తగిలినట్టుగా జగన్మోహిని చిత్రానికి ముందుగానే కథానాయకుడిగా అనుకున్న నరసింహారాజు.. విఠలాచార్యను కలిశారని తెలుస్తుంది.జయమాలిని కూడా అంతకుముందు కొన్ని ఐటెం సాంగ్స్ లో నటించి మంచి పాపులారిటీని దక్కించుకున్నారు.

 

పూర్తిగా చెప్పాలంటే జయమాలిని ఈ సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ లో కనిపించారు. జయమాలిని అంటే అప్పటికే ప్రేక్షకులలో కూడా ఎంతో క్రేజ్ ఉండేది. క్లబ్ డాన్స్ లో కనబడితే చాలు ఉర్రూతలూగిపోయేవారు.. అలాంటిది ఒక సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ లో చేస్తే ఇంకేమైనా ఉందా .. ప్రేక్షకులకు ఆనందానికి అవధులు ఉండవు. అప్పట్లో హీరోయిన్ ను తలదన్నే అందం అయితే జయమాలిని సొంతం. ఆమె షూటింగ్ చేస్తున్న సమయంలో ఆమె అందానికి ఫిదా కానీ హీరో ఉండేవారు కాదు. ఇక జయమాలిని సాధారణంగా షూటింగ్ కి హాజరైతే కేవలం డాన్స్ పైన తన మనసుని కేంద్రీకరించేవారని తోటి నటులతో ఆమె మాట్లాడేది కాదు. అయితే జయమాలినితో షూటింగ్లో పాల్గొన్నప్పుడు ఆమె అందానికి నరసింహారాజు పూర్తిగా ఫిదా అయిపోయారట. ఆమె అందాన్ని చూసి తట్టుకోలేక పోయాను కానీ నిగ్రహంతో ఉన్నాను అంటూ నరసింహారాజు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. ఇంకా తర్వాత కాలంలో ఆమెతో ఎప్పుడూ కూడా మాట్లాడలేదు అని, ఆమెపై నా మనసును పారేసుకోలేదని కూడా చెప్పుకొ

మరింత సమాచారం తెలుసుకోండి: