లైగర్ మూవీ దర్శకుడు పూరి జగన్నాధ్ ఇమేజ్ భారీగా దెబ్బతీసింది అని చెప్పొచ్చు. మనోడి టేకింగ్ చూసిన నిర్మాతలు జనగణమన చిత్రాన్ని మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు అంటా మరీ

పూరి డ్రీం ప్రాజెక్ట్ దారుణమైన పరిస్థితుల్లో ఆగిపోయింది. సినిమాకి ఉన్న హైప్ చూపి అత్యధిక ధరలకు లైగర్ హక్కులు అమ్మారు. మూవీకి డిజాస్టర్ టాక్ రావడంతో కనీసం 50 శాతం రికవరీ కూడా కాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లైగర్ కొన్న బయ్యర్లకు తీవ్ర నష్టాలు మిగిలాయి మరీ, దీంతో దర్శక నిర్మాతగా ఉన్న పూరి నష్టాలు పూడ్చాలని డిమాండ్ చేశారు.
దీనికి పూరి జగన్నాధ్ సైతం ఒప్పుకోవడం జరిగింది. అయితే లైగర్ విడుదలై రెండు నెలలు దాటిపోయినా పూరి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అంటా. బయ్యర్లకు హామీ ఇచ్చిన మొత్తం తిరిగి చెల్లించలేదు. దీంతో వారు యుద్ధానికి సిద్ధమయ్యారు. అక్టోబర్ 27న పూరి జగన్నాధ్ ఇంటి ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ వార్త పూరి జగన్నాధ్ వరకూ చేరింది. ఆయన కొంచెం పరుష పదజాలంతో ధర్నా చేస్తా అన్నవారికి వార్నింగ్ ఇచ్చాడు. ధర్నా చేసినవాళ్ళ పేర్లు రాసుకొని ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అంటూ మండిపడ్డాడు.

పూరి ఫోన్లో మాట్లాడిన ఆడియో కాల్  కూడా లీక్ కాగా… ఈ విషయం బయటకు వచ్చింది. అయితే ఈ తలనొప్పులన్నింటికీ ఛార్మినే కారణమంటూ ఓ వాదన ఇలా బయటకు వచ్చింది. ఛార్మి నోరు జారటం వలనే బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ధర్నాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఒక ప్రైవేట్ పార్టీకి హాజరైన ఛార్మి లైగర్ మూవీతో మాకు ఎలాంటి నష్టం రాలేదు. పైగా శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో లాభాలు వచ్చాయి. మేము హ్యాపీగా ఉన్నామని చెప్పారట ఛార్మి. ఈ మాట మెల్లగా బయ్యర్ల వరకూ చేరిందట.

మనం నష్టాలతో ఆర్థికంగా నలిగిపోతే పూరి, ఛార్మి మాత్రం చక్కగా లాభాలు ఎంజాయ్ చేస్తున్నారా? అని వాళ్ళు ఆగ్రహానికి గురయ్యారట. ఆ కారణంగానే పూరి ఇంటి మూడు ధర్నా చేయాలనే నిర్ణయానికి వచ్చారట బయ్యర్స్. నచ్చజెప్పి మెల్లగా ఎంతో కొంత ముట్ట చెబుదామని ప్లాన్ లో ఉన్న పూరికి ఛార్మి కారణంగా ఇబ్బందులు తలెత్తాయి అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియదు కానీ టాలీవుడ్ లో ప్రముఖంగా ప్రచారం  బాగా అవుతుంది. నాకు రావాల్సిన అమౌంట్ ఇంకా రాలేదు, అందుకే ఆలస్యం అవుతుందని పూరి అంటున్నారు. ఇక ఈ లైగర్ పంచాయితీ ఎలా ముగుస్తుందో  వేచి చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: