నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ పోయిన సంవత్సరం అఖండ మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అఖండ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది. అఖండ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ,  ఈ మూవీ లో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. పూర్ణ ఒక కీలకమైన పాత్రలో నటించగా , శ్రీకాంత్మూవీ లో విలన్ గా నటించాడు. ఇది ఇలా ఉంటే అఖండ మూవీ తో మంచి విజయం అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం పోయిన సంవత్సరం రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  దునియా విజయ్ విలన్ గా కనిపించబోతున్నాడు. తమన్మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా ,  వరలక్ష్మీ శరత్ కుమార్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం వీర సింహారెడ్డి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  వీర సింహారెడ్డి మూవీ యూఎస్ఏ హక్కులను శ్లోక సినిమా సంస్థ 3.80 కోట్ల భారీ ధరకు విక్రయించినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: