తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయిన శైలేష్ కొలను గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ తో మంచి విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయం సాధించడంతో , ఈ దర్శకుడు ఈ మూవీ నే హిందీ లో హిట్ ది ఫస్ట్ కేస్ అనే పేరు తోనే రీమేక్ చేశాడు.  

మంచి అచనాల నడుమ హిందీలో విడుదల అయిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ హిందీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయం సాధించడం తో , ప్రస్తుతం ఈ దర్శకుడు ఈ మూవీ కి సీక్వల్ గా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ లో అడవి శేషు హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ విడుదల తేదీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను చేసింది. ఈ మూవీ టీజర్ ను నవంబర్ 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే హిట్టు ది సెకండ్ కేస్ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం తో హిట్ ది సెకండ్ కేస్ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: