తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హరీష్ శంకర్ , మాస్ మహారాజా రవితేజ హీరోగా జ్యోతిక హీరోయిన్ గా తరికెక్కిన షాక్ మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను ప్రారంభించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన షాక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది. ఆ తరువాత ఈ దర్శకుడు రవితేజ హీరోగా తెరకెక్కిన మిరప కాయ్ మూవీ కి దర్శకత్వం వహించాడు. మిరప కాయ్ మూవీ తో హరీష్ శంకర్ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ కి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ "గబ్బర్ సింగ్" మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ ఆఖరుగా వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గద్దల కొండ గణేష్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించాడు.

కాకపోతే ఈ మూవీ ప్రారంభం కావడానికి ఇంకా కాస్త సమయం పట్టి అవకాశం ఉన్నందున ,  ఈ దర్శకుడు ఆలోపు వేరే హీరోతో ఒక సినిమా చేయాలి అని డిసైడ్ అయినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అందులో భాగంగా హరీష్ శంకర్ , బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఒక మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: