అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అడవి శేషు సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది. హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. హిట్ ది సెకండ్ కేసు మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది.

మూవీ టీజర్ అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ టీజర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. హిట్ ది సెకండ్ కేస్ మూవీ టీజర్ 24 గంటల సమయం లో 5.96 మిలియన్ వ్యూస్ ను , 128.2 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే హిట్ ది సెకండ్ కేస్ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న అడవి శేషు ఈ మూవీ లో హీరోగా నటించడం , ఈ మూవీ హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కడం ,  శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో హిట్ ది సెకండ్ కేస్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి.  

మరి ఈ మూవీ తో అడవి శేషు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే అడవి శేషు తాజాగా మేజర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: