ప్రతి వారం లాగానే ఈవారం కూడా ఓటీటి సినీ ప్రేక్షకులను ఈవారం పలు చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన బ్రహ్మాస్త్ర మొదటి భాగం, ps -1 సినిమాలు కూడా విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇటీవల కాలంలో విడుదలకు ముందు ఈ సినిమాలకు భారీ హైట్ క్రియేట్ అయ్యి అంచనాలను అందుకోలేకపోయాయి. భారీ బడ్జెట్లో తెరకెక్కించిన ఈ చిత్రాలు ఉన్నాయనిడంలో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమాలు సొంత భాషలలో మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ ఇతర భాషలలో మాత్రం ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయాయి.


అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర సినిమాలో రణబీర్ కపూర్ ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో నాగార్జున కీలకమైన పాత్రలో నటించారు ఈ సినిమా నవంబర్ 4వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. ఈ చిత్రం తెలుగు ఆడియోస్ నుంచి మంచి స్పందన లభిస్తుంది థియేటర్లో మిస్సయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటి లో ఈ సినిమాని చూడడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.


మరొకవైపు లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఒక హిస్టారికల్ సినిమా పొన్నియన్ సెల్వన్. ఈ చిత్రంలో త్రిష ,కార్తీ ,జయం రవి, విక్రమ్, శోభిత దూలిపల్లి, ఐశ్వర్యారాయ్ తదితరులు నటించారు. ఈ చిత్రం చోళుల కాలం నాటి కథ అంశంతో తెరకెక్కించారు తమిళంలో భారీ విజయాన్ని అందించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలవ్వగా అంతగా ఆకట్టుకోలేకపోతున్నట్లు సమాచారం. అయితే బ్రహ్మాస్త్రం సినిమానీ ఎంతో ఆతృతగా తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు కానీ ps -1 సినిమాని పెద్దగా పట్టించుకోలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: