తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటువంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  అడవి శేషు కెరియర్ ప్రారంభం లో ఎన్నో మూవీ లలో నటించినప్పటికీ క్షణం మూవీ తో అడవి శేషు కు మంచి గుర్తింపు లభించింది. క్షణం మూవీ ద్వారా హీరో గా తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్న ఈ యువ హీరో , ఆ తర్వాత గూఢచారి ,  ఎవరు , మేజర్ మూవీ లతో వరుస విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అడవి శేషు "హిట్ ది సెకండ్ కేస్" మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన , శైలేష్ కోలను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు  ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా అడవి శేషు , నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షో కు హీరో శర్వానంతో పాటు అడవి శేష్ గెస్ట్ గా విచ్చేశాడు. ఈ టాక్ షో లో భాగంగా బాలకృష్ణ ,  శర్వానంద్ ,  అడవి శేషు అనేక ఆసక్తికరమైన విషయాలను చర్చించారు. ఇందులో భాగంగా బాలకృష్ణ ఒక ఆసక్తికరమైన ప్రశ్నను అడవి శేష్ ను అడిగాడు. అడవి శేషు కూడా ఆ ప్రశ్నకు అంతే ఆసక్తిగా సమాధానాన్ని ఇచ్చాడు. బాలకృష్ణ ఈ అమ్మాయితో అస్సలు కిస్ ఏ వద్దురా బాబు అనుకున్న హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నను అడవి శేషు ను ప్రశ్నించాడు. ఈ ప్రశ్న కు అడివి శేషు ... పూజా హెగ్డే అని సమాధానం ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే అన్ స్టాపబుల్ సీజన్ 2 లో భాగంగా శర్వానంద్ కూడా అనేక ఆసక్తికరమైన విషయాలకు సమాధానాలు ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: