రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే ఈ సంవత్సరం రాధే శ్యామ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన రాధే శ్యామ్ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో రాధే శ్యామ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో ప్రభాస్ "ఆది పురుష్" మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు.

మూవీ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ప్రభాస్మూవీ లో రాముడి పాత్రలో కనిపించనుండగా ,  కృతి సనన్ ఈ మూవీ లో సీత పాత్రలో కనిపించబోతుంది. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను మరియు ఒక టీజర్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యూనిట్ ఈ మూవీ నుండి విడుదల చేసిన పోస్టర్ లకు మరియు టీజర్ కు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించింది.

కాకపోతే సంక్రాంతి కి ఇతర మూవీ లు కూడా విడుదల అవుతూ ఉండడంతో వాటితో పోటీ పడకుండా సింగిల్ గా రావాలనే ఉద్దేశంతో ఆది పురుష్ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలను వాయిదా వేసే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మార్చి 30 వ తేదీ న విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఆది పురుష్ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: