ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఇక తెలుగులో కూడా ఆమె నాలుగైదు చిత్రాల్లో నటించారు.అయితే ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి చిత్రాల్లో రవీనా టాండన్ మెరిశారు.అంతెందుకు ప్రస్తుతం రవీనా వయసు 47 ఏళ్ళు. ఇక ఈ వయసులో కూడా ఆమె చెక్కు చెదరని గ్లామర్ తో మతిపోగొడుతున్నారు.ఇకపోతే కేజీఎఫ్ 2లో రవీనాటాండన్ ప్రధాన మంత్రి పాత్రలో నటించి మెప్పించింది.ఇక  చాలా రోజుల తర్వాత రవీనా ఒక పవర్ ఫుల్ రోల్ ప్లే చేసింది.అయితే  ఈ చిత్రంలో రవీనా నటనకి ప్రశంసలు దక్కాయి. 

కాగా 90వ దశకంలో రవీనా టాండన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణించారు. అయితే ఇక  చిత్ర పరిశ్రమలో తాను ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నట్లు రవీనా పలు సందర్భాల్లో తెలిపింది.అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో రవీనా తన జీవితంలో జరిగిన భయంకర సంఘటనని గుర్తు చేసుకుంది.ఇక  గ్లామర్, నటన ఉండడంతో రవీనాకి ఎంతో మంది అభిమానులు ఉండేవారు.అయితే  కొందరు పిచ్చి అభిమానంతో ప్రవర్తించేవారు. ఇక ఒక అభిమాని మితిమీరి ప్రవర్తించాడు. అంతేకాదు నాకు రక్తంతో ప్రేమ లేఖలు, నగ్న వీడియోలు పంపేవాడు. ఇక ఆ అభిమాని ప్రవర్తన వల్ల నరకం చూశాను.అయితే  దీనితో పోలీసులకు ఫిర్యాదు చేయక తప్పలేదు అని రవీనా పేర్కొంది.

తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించేవాడు. ఇక తన ప్రేమని ఒప్పుకోవాలని టార్చర్ పెట్టేవాడు.ఇకపోతే  తాను ఫ్యామిలీతో బయటకి వెళ్ళినప్పుడు కారుపై రాయి వేశాడు. అయితే తన ప్రేమని ఒప్పుకోవాలని గట్టిగా అరిచాడు అంటూ ఆ అభిమాని పిచ్చి ప్రవర్తనని రవీనా తెలిపింది.తన గురించి వచ్చిన లవ్ ఎఫైర్స్ వార్తల విషయంలో కూడా తాను చాలా ఇబ్బంది పడ్డట్లు రవీనా పేర్కొంది.అయితే  ఒకసారి తనకు అన్న కావాల్సిన వ్యక్తితో కూడా సంబంధం అంటగట్టారు అని వాపోయింది.ఇక  దీనితో మీడియా అంటే కూడా తనకి భయం వేసేది అని రవీనా పేర్కొంది.ఇదిలావుంటే రవీనా టాండన్ భర్త అనిల్ తడానీ బాలీవుడ్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. ఇక అనిల్ తడానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు మంచి సన్నిహితుడు.కాగా రవీనా ఇప్పటికి తన గ్లామర్ తో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: