అందాల ముద్దుగుమ్మ , అద్భుతమైన నటి అయినటు వంటి సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో కమర్షియల్ మూవీ లలో తన అందచందాలను ఆరబోసి ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరించిందో ,  ఎన్నో మూవీ లలో తన వైవిధ్యమైన నటన తో కూడా అదే రేంజ్ లో సమంత ప్రేక్షకులను అలరించింది.

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సమంత ఎక్కువ శాతం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ వస్తోంది. అందులో భాగంగా సమంత తాజాగా యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కి హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా , మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని కృష్ణ ప్రసాద్ నిర్మించాడు. నవంబర్ 11 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే సమంత అనారోగ్యం పాలైన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ విషయంపై యశోద మూవీ నిర్మాత కృష్ణ ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సమంత అనారోగ్యం పై కృష్ణ ప్రసాద్ స్పందిస్తూ ... యశోద మూవీ డబ్బింగ్ సమయం లోనే సమంత అనారోగ్యంతో ఉన్నట్లు చెప్పింది. అప్పుడే సమంత అనారోగ్యం గురించి మాకు తెలిసింది. ఆ టైమ్ లో ఆమె పూర్తిగా నిరసించింది. డాక్టర్ పర్యవేక్షణలో సెలైన్ తో యశోద సినిమా తెలుగు మరియు తమిళ భాషల డబ్బింగ్ ను చెప్పింది. ఈ మూవీ హిందీ డబ్బింగ్ ను చిన్మయి చెప్పింది అని తాజాగా యశోద మూవీ నిర్మాత కృష్ణ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: