ఈ మధ్య తెలుగు హీరోయిన్లు పెళ్ళి పీటలు ఎక్కుతున్నారు. అంతే కాదు..సినిమాలకు గ్యాప్ తీసుకోని కుటుంబ బాధ్యతలు చూసుకోవడం మాత్రమే కాదు..పిల్లలను కూడా కనేస్తున్నారు..మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం స్లిమ్ అయి ఫోటోషూట్స్ చేస్తూ వస్తున్నారు..మొన్న కాజల్ అగర్వాల్, నిన్న ప్రనీత..ప్రణీత సుభాష్.. టాలీవుడ్ లో ఈ చిన్నది పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది..అయితే అమ్మడుకు హీరోయిన్ గా మాత్రం మంచి హిట్ ను ఇవ్వలేదు..



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది లో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కూడా పలు ల్లో నటించిన ఈ భామ. ఆ తర్వాత పెళ్లి చేసుకొని లకు దూరమైంది. లతో బిజీగా ఉన్న సమయంలోనే తన స్నేహితుడు ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ప్రణీత. ఇటీవలే ప్రణీత కు బిడ్డకు జన్మనిచ్చింది. పాప పుట్టిన తర్వాత ప్రణీత పూర్తిగా తన టైం ను తనతో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది. పాప ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.



అయితే తాను పోస్ట్ చేసిన ఫొటోల్లో ఎప్పుడు పాప మొఖం కనిపించకుండా లవ్ ఎమోజీలు పెట్టేది ప్రణీత. అయితే తాజాగా షేర్ చేసిన ఫొటోస్ లో పాప మొఖం కనిపించేలా పోస్ట్ చేసింది. ఆ బుజ్జిది చాలా క్యూట్ గా ఉంది. ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఫోటో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం ప్రణీతలనే ఉంది అని అంటున్నారు కొందరు. మరికొంతమంది ప్రణీత కూతురు చాలా క్యూట్ గా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడే ఇంత పెద్దది అయ్యిందా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు పలువురు.మొత్తానికి ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: