మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయిన సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటికే ఎన్నో కమర్షియల్ మూవీ లలో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో లేడీ ఓరియంటెడ్ మూవీ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో భాగంగా సమంత ఇప్పటికే యూ టర్న్ , ఓ బేబీ వంటి మూవీ లలో ప్రధాన పాత్రలలో నటించి ఆ మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా సమంత "యశోద" అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా , ఉన్ని ముకుందన్ , వరలక్ష్మి శరత్ కుమార్ , రావు రమేష్ , మురళీ శర్మమూవీ లో ఇతర ముఖ్య పాత్రలో నటించారు.

మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ నిన్న అనగా నవంబర్ 11 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ ,  కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించడం తో ప్రస్తుతం యశోద మూవీ కి మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసినట్లు , కొన్ని వారాల థియేటర్ రన్ తర్వాత ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: