టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగర్జున ఇప్పటికే ఈ సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో ప్రేక్షకులను పలకరించిన నాగార్జున , ఆ తర్వాత బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నాగార్జున "ది ఘోస్ట్" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సర్దార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , సోనాల్ చౌహాన్మూవీ లో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన మంచి అంచనాల నడుమ భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. 

కాకపోతే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ మొత్తంలో కలెక్షన్ లు మాత్రం రాలేదు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ మొత్తంలో కలక్షన్ లను వసూలు చేయలేకపోయిన ది ఘోస్ట్ మూవీ కొన్ని రోజుల క్రితం నుండే నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ హిందీ వర్షన్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు వర్షన్ కంటే ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తోంది. నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ది ఘోస్ట్ మూవీ హిందీ వర్షన్ ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా ,  తెలుగు వర్షన్ 4 వ స్థానంలో కొనసాగుతుంది. ఇలా ది ఘోస్ట్ మూవీ హిందీ వర్షన్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: