దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి ఇప్పటికే ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి , దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తోను బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని , ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన దర్శకుడి గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే రాజమౌళి తాజాగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు.

మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ ,  హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ లో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటించగా జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటించింది. అజయ్ దేవగన్ , శ్రేయ ,  సముద్ర ఖని ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించగా , ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందించాడు.

ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకుల మరియు విమర్శకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూ లో ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.  రాజమౌళి "ఆర్ ఆర్ ఆర్" సీక్వెల్ గురించి స్పందిస్తూ ... నేను మరియు నా తండ్రి ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ కు సంబంధించిన పనులను ప్రారంభించాము అని ,  ఆర్ ఆర్ ఆర్ సినిమా సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: