మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకుంది. బాలీవుడ్ సినిమాల ద్వారా ఫుల్ క్రేజీ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన లెజెండ్ మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , అలాగే లెజెండ్ మూవీ లో రాధిక ఆప్టే పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించడంతో  రాధిక ఆప్టే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ను తగ్గించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు. ఎక్కువ శాతం బాలీవుడ్ సినిమా ల్లోనే నటిస్తూ తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజగా రాధిక ఆప్టే నటి మనులకు అవకాశాలు రావడంలో వయసు చాలా ప్రభావం చూపుతుంది అనే విషయం పై చర్చించింది. తాజాగా రాధిక ఆప్టే నటీమణులకు అవకాశాలు రావడం లో వయసు ప్రభావం చూపిస్తుంది అని చెప్పు కొచ్చింది. అలాగే భారీ బడ్జెట్ కమర్షియల్ మూవీ లలో యువ నటీమణులకు ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి. హీరోయిన్ కు కావలసిన లక్షణాలు మీకు లేవు అనే కామెంట్స్ చాలా మంది ఎదుర్కొంటున్నారు. లుక్స్ ను బట్టి అవకాశాలను ఇవ్వడం విదేశాల్లో ఉంది , ఇప్పుడిప్పుడే దీనికి వ్యతిరేకంగా మహిళలు గళం విప్పుతున్నారు అని రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే రాధిక ఆప్టే ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన నటన తో ,  తన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: