బన్నీ హీరోగా సుకుమార్  తెరకెక్కిస్తున్న 'పుష్ప 2' సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈమధ్యనే ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.అయితే అల్లు అర్జున్ ఇంకా టీమ్‌లో చేరలేదు. అయితే ప్రస్తుతం ఇతర నటీనటులు ఇంకా వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ అనేది జరుగుతోంది. ఇంకా అదే సమయంలో ఈ సినిమా ప్రమోషన్ కు ప్రత్యేకమైన ప్లాన్ చేసారట.డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్న విజువల్ వండర్ పాన్ వరల్డ్ మూవీ 'అవతార్ 2' తో పాటుగా పుష్ప 2 సినిమా స్పెషల్ టీజర్ కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారట. ప్రపంచపు నెంబర్ వన్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన మరో అద్భుత సృష్టి అవతార్ 2. ఆ సినిమా కోసం ప్రపంచ సినీ ప్రియులంతా కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఓ రేంజిలో ఓపినింగ్స్ కూడా ఉంటాయి.


దాంతో ఆ సినిమాతో పాటు టీజర్స్ ఇంకా ట్రైలర్స్ రిలీజ్ చేయటానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తారు. అందుకే  ఆ రోజు స్పెషల్ టీజర్ రిలీజ్ చేస్తే... కావాల్సినంత పబ్లిసిటీ వస్తుందని సుకుమార్ గట్టి ప్లాన్ చేస్తున్నారట.అలాగే ఈ సూపర్ ఐడియాకు అల్లు అర్జున్ చాలా ఆనందపడ్డాడట.అంటే ఓ రకంగా పాన్ ఇండియా టీజర్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అవతార్ 2 ఆడే ప్రతి చోట కూడా పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ అవుతుంది.ఈ పుష్ప 2 స్పెషల్ టీజర్ ని మొత్తం 25 భాషల్లో రెడీ చేస్తున్నారట. అవతార్ 2 సినిమాతో పుష్ప 2 టీజర్ అంటే నిజంగానే సినిమాకి నెక్స్ట్ లెవల్ ప్రమోషన్ అని చెప్పాలి. సుకుమార్ టీజర్ రిలీజ్ తో నే చరిత్ర సృష్టించడం ఖాయం అనిపిస్తుంది. పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ కోసం రామోజి ఫిల్మ్ సిటీలో ప్రత్యేకమైన సెట్ లో ఈ షూటింగ్ చేస్తున్నారని సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: